నిన్ను లేపేస్తా.. కేంద్ర మంత్రి బెదిరింపు కాల్‌.. ఎందుకు? ఎక్క‌డ‌?

Update: 2023-01-15 12:30 GMT
ఆయ‌న కేంద్ర మంత్రి. పైగా సామాజిక చైత‌న్యం ఉన్న నాయ‌కుడు. అలాంటి నాయ‌కుడికి తాజాగా బెదిరింపు కాల్ వ‌చ్చింది. అది కూడా మూడు సార్లు. ప్ర‌తిసారీ.. ఫోన్ చేసిన వ్య‌క్తి.. నిన్ను లేపేస్తా! అంటూ.. బెదిరించాడు. అంతేకాదు.. 100 కోట్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. దీంతో భీతిల్లిన మంత్రి సంక్రాంతి పూట‌.. ఇదేంటంటూ.. పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఇంత‌కీ, ఆయ‌నెవ‌రంటే.. మంత్రి నితిన్ గ‌డ్క‌రీ!  సౌమ్యుడిగా వివాద ర‌హితుడిగా ఆయ‌న పేరుతెచ్చుకున్నారు.

అస‌లేం జ‌రిగింది?  

మహారాష్ట్రలోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. శనివారం ఉదయం మహారాష్ట్ర నాగ్పుర్లోని ఆయన కార్యాలయానికి 11:25 నుంచి 12:30 గంటల మధ్య దావూద్ ఇబ్రహీం గ్యాంగ్కు చెందిన వాడినంటూ ఓ వ్యక్తి మూడు సార్లు కాల్స్ చేసి రూ.100 కోట్లు డిమాండ్ చేశాడు. అంతేకాదు.. స‌ద‌రు సొమ్ము ఇవ్వ‌క‌పోతే.. లేపేస్తా! అని బెదిరించాడు. సమాచారం అందుకొన్న నాగ్పుర్ పోలీసులు హుటాహుటిన ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. ఆ కాల్స్పై పూర్తి విచారణ చేపట్టారు.

"కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి తాను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ మెంబర్ను అని చెప్పి గడ్కరీ కార్యాలయానికి మూడు సార్లు కాల్ చేశాడు. గడ్కరీ నుంచి రూ. 100 కోట్లు డిమాండ్ చేశాడు. తన డిమాండ్ నెరవేర్చకుంటే.. మంత్రిపై బాంబు దాడి చేసి చంపేస్తానని బెదిరించాడు. తన అడ్రస్కు డబ్బు పంపించమని కోరాడు. తన ఫోన్ నంబర్, చిరునామా చెప్పాడు. ఆ నిందితుడికి గతంలో నేర చరిత్ర కూడా ఉంది. నిందితుడు చెప్పిన అడ్రస్కు క్రైమ్ బ్రాంచ్ బృందాన్ని పంపించాము" అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుతం నాగ్‌పుర్‌లో ఉన్నారు. అక్కడ ఆయన మకర సంక్రాతి వేడుకలు జరుపుకోను న్నారు. దీంతో ఆయన వేడుక జరుపుకునే ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు నాగ్పుర్ డీసీపీ తెలిపారు. 
Tags:    

Similar News