కరోనాతో ప్రస్తుతం మనదేశం విలవిలలాడుతున్న విషయం తెలిసిందే. భారత్ పరిస్థితి చూసి ప్రపంచదేశాలన్నీ జాలి పడే పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉంటే కరోనాపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ’ చాలా మంది కరోనా సెకండ్ వేవ్ చూసి భయపడుతున్నారు. కానీ మూడోవేవ్, నాలుగో వేవ్ కూడా పొంచి ఉన్నాయి. ఆ లోపు వివిధ రాష్ట్రాలు మౌలిక వసతులు మెరుగుపరుచుకోవాలి’ అంటూ నితిన్ గడ్కరీ సూచించారు.
మనదేశంలో సెకండ్ వేవ్ వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. భారతీయులకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుందని .. అందుకే ఇక్కడ కరోనా కేసులు సంఖ్య ఎక్కువగా ఉన్నా.. కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయని వైద్యులే చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. ప్రతిరోజు వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గతంలో కరోనా వచ్చినా వాళ్లల్లో ఎక్కువ మంది హోం ఐసోలేషన్లో ఉండి కోలుకొనేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆస్పత్రుల్లో ఆడ్మిట్ కావాల్సి వస్తుంది. అక్కడ బెడ్ల కొరత ఏర్పడింది. ఆక్సిజన్ అందక రోజు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి వ్యాఖ్యలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. మే 1 నుంచి వ్యాక్సినేషన్ మొదలు కానున్నది. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. మంగళవారం ఒక్కరోజే మనదేశంలో 3,60,960 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267 కు చేరింది. నిన్న ఒక్కరోజే 3,293 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో 29,78,709 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు 1,48,17,371 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. అయితే ఈ సంఖ్య ఎలా ఉన్నప్పటికీ ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి చూసి చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు.