శనివారం వచ్చిందంటే చాలు.. బ్యాంకులు ఒంటిపూట పని చేస్తాయని చాలామందికి తెలుసు. కానీ.. తాజాగా మరో మార్పు చోటు చేసుకుంది. శనివారం పూట బ్యాంకు పని పెట్టుకుంటే మాత్రం అడ్డంగా బుక్ అయిపోయినట్లే.
ఎందుకంటే.. సెప్టెంబర్ 1 నుంచి ప్రతి నెల 2.. 4 శనివారాల్లో బ్యాంకులు పని చేయవు. సెలవుదినాలుగా అమలు చేయనున్నారు. నెలకు రెండు శనివారాల్ని సెలవులుగా ఇవ్వాలని ఎన్నోఏళ్లుగా బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి నెల రెండు.. నాలుగో శనివారాల్లో బ్యాంకులు పని చేయవని చెబుతున్నారు.
ఈ సెలవు కారణంగా బ్యాంకు ఉద్యోగుల పని సామర్థ్యం మరింత పెరిగే వీలుందని భావిస్తున్నారు. తాజా నిర్ణయాన్ని సెప్టెంబరు 1 నుంచి అమలు చేస్తారు. ఈ లెక్కన సెప్టెంబరు నెల వరకు చూస్తే.. 12.. 26వ తేదీల్లో బ్యాంకులు పని చేయవు. ఒకవేళ ఏదైనా నెలలో 5 శనివారాలున్నా.. రెండు.. నాలుగు శనివారాలు సెలవుగా పరిగణిస్తారు. సో.. వీకెండ్ లో బ్యాంక్ పని పెట్టుకునే వారంతా ఈ తాజా మార్పును నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సుమా.