విభజన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడిన ఏపీకి అధరవుగా నిలిచేందుకు కేంద్రం ఏమీ చేయటం లేదన్న విమర్శకు చెక్ చెప్పేందుకు మోడీ సర్కారు నడుం బిగించింది. ఏపీకి పలు ప్రాజెక్టులు ఇచ్చే క్రమంలో భాగంగా తాజాగా ఒక కొత్త ప్రాజెక్టును ఏపీకి ప్రకటించింది. దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న డ్రైడ్జింగ్ హార్బర్ ను ఏపీకి కేటాయించింది. ఈ హార్బర్ కోసం రూ.1890 కోట్ల విలువైన నిధులు ఇచ్చేందుకు ఓకే చేసింది.
ఏమిటీ ప్రాజెక్టు?
బంగాళాఖాతం.. హిందూ మహా సముద్రం.. అరేబియా సముద్రాల్లో ఎక్కడైనా సరే డ్రెడ్జింగ్ చేపట్టాలంటే తాజా ప్రాజెక్టు నుంచే చేపడతారు. దేశంలోని పోర్టుల అనుసంధానికి సాగరమాల ప్రాజెక్టుకు తాజాగా చేపట్టనున్న డ్రెడ్జింగ్ ప్రాజెక్టు కీలకం.
ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేస్తారు?
ఏపీలోని కాకినాడకు సమీపంలో ఉన్న అంతర్వేదిలో ఏర్పాటు చేస్తారు. అంతర్వేది సాగరతీరంలో రెండు కిలో మీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తారు.
ఎంత నిధులు రానున్నాయి
కేంద్రం ఓకే చేసిన తాజా ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం మూడు విడతల్లో నిధులు రానున్నాయి. తొలి విడతలో రూ.730కోట్లు.. రెండో విడతలో రూ.640 కోట్లు.. మూడో విడతలో రూ.520 కోట్ల నిధుల్ని కేంద్రం విడుదల చేయనుంది.
ఏమేం వస్తాయి?
డ్రెడ్జింగ్ హార్బర్ ప్రాజెక్టులో శిక్షణా సంస్థ.. వర్క్ షాప్.. జెట్టీల నిర్మాణం.. డ్రెడ్జింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు.
ఏపీకే ఈ ప్రాజెక్టు ఎందుకు వచ్చింది?
కేంద్రం ఏపీ పట్ల ప్రదర్శించిన అభిమానం అంటూ చెబుతున్నా.. దీని వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కారణం. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు కోసం ముంబయి.. మంగళూరులలో ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర.. కర్ణాటక రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే.. ఈ ప్రాజెక్టును చేజిక్కించుకోవటానికి చంద్రబాబు ముందు చూపు.. అధికారుల్ని అలెర్ట్ చేయటంతో పాటు.. ప్రాజెక్టుకు అవసరమైన భూమిని కేటాయించే విషయంలో ఏపీ సర్కారు ప్రదర్శించిన చురుకుదనమే ప్రాజెక్టు రావటానికి కారణం.
ఎప్పటికి పూర్తి అవుతుంది?
ఈ ప్రాజెక్టును రెండేళ్ల పరిమిత కాలంలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఒకసారి ఇది పూర్తి అయిన వెంటనే ఏపీ.. తమిళనాడు తీరం వెంట విస్తృతంగా డ్రెడ్జింగ్ కార్యకలాపాలు చేపట్టి అంతర్రాష్ట్ర జలమార్గాల్ని అభివృద్ధి చేసే మార్గం సుగమం కానుంది.