యువ‌రాజు ఫోన్ ఎఫెక్ట్: చెల‌రేగిపోయిన సీఎం

Update: 2017-08-02 09:24 GMT
జారిపోతున్న ఎమ్మెల్యేల్ని ఒకే చోట ఉంచుతూ క్యాంప్ రాజ‌కీయాల్ని నిర్వ‌హిస్తున్న గుజ‌రాత్ కాంగ్రెస్ పార్టీకి.. ఆ పార్టీకి కీల‌క‌మైన అధినేత‌ల‌కు దిమ్మ తిరిగిపోయే షాక్ త‌గిలింది. క్యాంపు రాజ‌కీయాల్ని నిర్వ‌హించ‌టంలో మాంచి ప‌ట్టు ఉన్న కాంగ్రెస్‌ కు మోడీ మార్క్ నిర్ణ‌యం బిత్త‌ర‌పోయేలా చేసింది.

దీంతో.. ఈ తీరును తీవ్రంగా ఖండించాలంటూ కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం నిర్వ‌హించింది. ఇప్ప‌టికే ప‌లు క్యాంప్ రాజ‌కీయాల్ని నిర్వ‌హించినా ఎప్పుడూ చోటు చేసుకోని రీతిలో.. ట్విస్ట్ అదిరిపోవ‌టం.. ఐటీ శాఖాధికారులు రంగ‌ప్ర‌వేశం చేయ‌టంతో ఇది క‌చ్చితంగా రాజ‌కీయ కుట్ర‌గా కాంగ్రెస్ ఖండిస్తోంది.

ఇదిలా ఉంటే క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌కు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఫోన్ చేసి.. బీజేపీ తీరును తీవ్రంగా ఖండించాల‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. క‌ర్ణాట‌క సీఎంకు రాహుల్ ఫోన్ చేశార‌న్న వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చిన కాసేప‌టికే క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య రియాక్ట్ అయ్యారు. త‌మ ప్ర‌భుత్వంపై కేంద్రం క‌క్ష సాధిస్తోంద‌న్నారు.

రూల్స్‌కు భిన్నంగా ఐటీ శాఖ సోదాలు నిర్వ‌హిస్తోంద‌న్నారు. సోదాల‌కు ముందు క‌నీసం స్థానిక పోలీసుల‌కు క‌నీస స‌మాచారాన్ని కూడా ఇవ్వ‌లేద‌ని.. త‌మ‌ను బ‌ద్నాం చేసేందుకే దాడులు నిర్వ‌హిస్తున్న‌ట్లుగా సీఎం వ్యాఖ్యానించారు. ఐటీ శాఖ తాజాగా నిర్వ‌హించిన సోదాల్లో రూ.7.5 కోట్ల న‌గ‌దు ప‌ట్టుబ‌డ‌టం తెలిసిందే. సిద్ధ‌రామ‌య్య మాట‌ల్ని చూస్తే.. రాహుల్ చేసిన ఫోన్ కాల్ వ‌ర్క్ వుట్ అయ్యింద‌నే చెప్పాలి.
Tags:    

Similar News