మరో పంచాయితీ ముగిసినట్లే. రెండు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత..రాష్ట్రాల బయట ఉండే ఆస్తుల్నిఇరు రాష్ట్రాలకు ఎలా పంచాలన్న విషయంపై నెలకొన్న వివాదానికి తెర దించుతూ.. విభజన చట్టంలోని మాటనే ఫిక్స్ చేసేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇందుకోసం మూడేళ్లుగా నానబెట్టి.. ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేసింది కేంద్ర సర్కార్.
దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ ను ఎలా పంచుకోవాలన్న విషయంపై ఒక స్పష్టతను ఇచ్చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ నిజాం ప్రభువులదని.. అందుకే ఏపీ భవన్ ను తమకు ఇచ్చేయాలంటూ తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాదనకు భిన్నంగా కేంద్రం తాజా నిర్ణయం ఉందని చెప్పాలి. విభజన చట్టం లోని సెక్షన్ 48(1) ప్రకారం.. రెండు రాష్ట్రాలకు బయట ఉన్న ఆస్తుల్ని 58:42 జనాభా నిష్పత్తిలో పంచుకోవాలని స్పష్టం చేసింది.
రెండు రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన ఆస్తుల్ని పంచుకోవాలంటూ స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ ఆ విషయాన్ని తాజాగా తెలంగాణ సర్కారుకు సమాచారం అందించింది. తాము తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ సర్కారుకు తెలియజేసింది. తాజానిర్ణయంతో ఏపీ భవన్ విషయంపై పంచాయితీ ముగిసినట్లేనని చెప్పక తప్పదు. మరి.. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కేసీఆర్ ఓకే చేస్తారా? లేక.. మరో వాదనకు తెర తీస్తారా?అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/