విభజన పుణ్యమా అని ఆర్థికంగా పూర్తిస్థాయి వెనుకబాటుతో ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీకి ప్రత్యేకహోదా సంజీవినిగా పని చేస్తుందన్న అభిప్రాయం ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తప్పించి.. కోలుకోవటం తేలికైన విషయంకాదని తేల్చి చెబుతున్న వారు చాలామందే ఉన్నారు.
మరోవైపు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై బీజేపీ ఇప్పటివరకూ నసుగుతూ.. నంగి నంగిగా మాట్లాడటం తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంలో ఆశలు పెట్టుకోవద్దన్న రీతిలో ఇప్పటికే సంకేతాలు ఇవ్వటం తెలిసిందే. అయితే.. ఏపీ నేతలంతా కలిసి ఒత్తిడి తీసుకొస్తే.. ప్రత్యేకహోదా ఇవ్వటం పెద్ద కష్టం కాదన్న పలువురు మాటల్లో నిజం లేదని తేలిపోయింది.
ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదని తేలిపోయింది. తాజాగా బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.
ఏపీకి ప్రత్యేకహోదాకు తప్పించి మరే డిమాండ్ అయినా కోరవచ్చని నడ్డా తేల్చి చెప్పేశారు. విశాఖలోజరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయనకు.. ఏపీకి ప్రత్యేకహోదా విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తే.. ఆయన ఎలాంటి మొహామాటం లేకుండా సూటిగా.. సుత్తి కొట్టకుండా డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వెళ్లిపోయారు.
ఏపీకి ప్రత్యేకహోదా తప్పించి.. ఎలాంటి సాయాన్ని చేయటానికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన ఆయన.. ''ఏపీకి ప్రత్యేక హోదా అన్న పదాన్ని వాడొద్దు. దాంతో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి అన్ని రకాల నిధులు ఇస్తాం'' అంటూ కుండ బద్ధలు కొట్టారు. ఏపీకి ప్రత్యేకహోదా తీసుకొచ్చేందుకు పోరుబాట పట్టాలని భావిస్తున్న వారు.. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.