రాజధాని కూడా లేని రాష్ట్రం.. మొన్నటివరకు చంద్రబాబు కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడంతో రూపాయి విదిల్చ లేదు కేంద్రంలోని బీజేపీ సర్కారు. కానీ వైఎస్ జగన్ వచ్చాక ఏపీ పరిస్థితి మారుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏపీకి రావాల్సిన నిధులను వడివడిగా విడుదల చేస్తోంది. పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తోంది.
జగన్ సీఎం అవ్వగానే కేంద్రంలో అధికారం చేపట్టిన మోడీని మర్యాదపూర్వకంగా కలువడం.. ఏపీకి సాయాన్ని అర్థం అర్థించాడు. చంద్రబాబు అంటే పడని మోడీ ఇప్పుడు జగన్ తో దోస్తీ చేస్తున్నాడు. ఆ కోవలోనే నిధులు విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే పోలవరానికి సంబంధించి నిధులను 3వేల కోట్లను విడుదల చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు నిధులను నాబర్డ్ నుంచి రిలీజ్ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనురుల శాఖ ప్రతిపాదనలు పంపింది.
ఇప్పుడు తాజాగా ఏపీలో ఉపాధిహామీ పథకానికి సంబంధించి రావాల్సిన పెండింగ్ నిధులను కేంద్రం విడుదల చేసింది. ఏపీకి రావాల్సిన మొత్తం నిధుల్లో ప్రస్తుతం రూ.708 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2500 కోట్లకు రూ.708 కోట్లు విడుదల చేసింది.
టీడీపీ ఏపీలో అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు కయ్యానికి కాలుదువ్వడంతో ఏపీకి రావాల్సిన నిధులన్నింటిని పెండింగ్ లో పెట్టిన కేంద్రం ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో విడుదల చేస్తోంది. జగన్ కేంద్రంతో సానుకూలంగా ఉండడంతో ఈ మేరకు బకాయిలు వేగంగా రిలీజ్ చేస్తోంది.