కేంద్రంతో ఎంత సఖ్యతగా ఉందామన్న ప్రయత్నాల్ని తెలంగాణ సర్కారు చేస్తున్నప్పటికీ.. అందుకు తగినరీతిలో మోడీ సర్కారు స్పందించటం లేదా? అన్న భావన కలిగే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. నోట్ల రద్దుపై మోడీ తీసుకున్న నిర్ణయంపై ఎన్డీయేతర రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున సమర్థించిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్సేనని చెప్పక తప్పదు. మోడీ సర్కారు తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నా.. దాన్ని పట్టించుకోకుండా.. మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించే విషయంలో నూటికి నూరుశాతం ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చెప్పుకోవాలి.
అలాంటి ఆయనకు కోపం కలిగే నిర్ణయాన్ని తాజాగా మోడీ సర్కారు తీసుకుందని చెప్పాలి. ప్రతి ఏటా రిపబ్లిక్ వేడుక సందర్భంగా గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే శకటాల విషయంలో కేసీఆర్ కు కోపం కలిగించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందని చెప్పాలి. రిపబ్లిక్ పెరేడ్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘బతుకమ్మ’ శకటాన్ని కేంద్ర రక్షణ శాఖ రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
రిపబ్లిక్ పెరేడ్ సందర్భంగా బతుకమ్మ శకటాన్ని ప్రదర్శించాలని గత ఏడాది కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ సందర్భంగా కూడా..ఈ ప్రతిపాదనను కేంద్ర రక్షణ శాఖ నో చెప్పినట్లుగా తెలుస్తోంది.
వచ్చే ఏడాది జనవరిలో జరిగే రిపబ్లిక్ వేడుకల్లో బతుకమ్మ శకటాన్ని ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం ఆశ పడుతోంది. ఇందుకు తగినట్లే ప్రాధమికంగా బతుకమ్మ శకటానికి ఆమోదం లభించినా.. తుది ఎంపికలో మాత్రం రిజెక్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ అధికారపక్ష ఎంపీలు బతుకమ్మ శకటానికి ఓకే చెప్పాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మాత్రం కేంద్రం పాజిటివ్ గా రియాక్ట్ కాకుంటే.. కేసీఆర్ కు కోపం రావటం ఖాయమని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/