అతి ఎప్పుడు కూడా అనర్ధదాయకమే. మద్యం విషయంలో కూడా ఈ నియమమే వర్తిస్తుంది. కానీ ఒక్కసారి మద్యం సిట్టింగులో కూర్చుంటే మాత్రం ఎవరూ కూడా కంట్రోల్ చేసుకోలేరు. మద్యం బాటిల్ ఖాళీ అయ్యేదాకా లేదంటే పీకలదాకా తాగేస్తూ ఉంటారు. వీరిలో 99 శాతం మంది మత్తులోకి జారుకుంటే.. కేవలం ఒక్క శాతం మాత్రమే ఎంత తాగిన స్టడీగా ఉంటారు.
ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ఎప్పుడో ఒకసారి తారసపడే ఉండి ఉంటాయి. ఈ ఒక్క శాతం మద్యం ప్రియులను మినహాయిస్తే మిగిలిన వారంతా మద్యం ఎక్కువైతే మాత్రం మత్తులోకి వెళ్లడం ఖాయం. ఒక్కొక్కరి కెపాటిసీ ఒక్కోలా ఉంటుంది. ఒకరికి కేవలం మద్యం వాసన చూస్తేనే మహేష్ బాబులా కిక్కు ఎక్కిపోతుంది.
మరికొందరికేమో రెండు పెగ్గులు.. మూడు పెగ్గులు.. క్వాటర్.. హాఫ్ బాటిల్.. పుల్ బాటిల్ అంటూ లెక్కలుంటాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మద్యం మత్తు తలకెక్కితే అలాంటి వాళ్లు ఏం చేస్తారో వారికే తెలియదు. ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ చేపట్టిన సమయంలో ఇాలాంటివి అనేకం కన్పిస్తుంటాయి. ఇటీవల కాలంలో మహిళలు సైతం డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడి సోషల్ మీడియాలో వైరల్ ఘటనలు అనేకం ఉన్నాయి.
తాజాగా ఓ ప్రముఖ కంపెనీ సీఎఫ్ఓ మద్యం మత్తులో చేసిన పనికి అందరు అవాక్కవుతున్నారు. ఏమాత్రం పరిచయం లేని మహిళ ఇంట్లోకి వెళ్లిన సీఎఫ్ఓ బట్టలు విప్పి మంచం పడుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని అర్కాన్సాస్ లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆ మహిళ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సీఎఫ్ఓ కథ అడ్డం తిరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆహా రంగంలో టైసన్ ఫుడ్ కంపెనీకి అమెరికాలో మంచి గుర్తింపు ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 24 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఈ కంపెనీ ఛైర్మన్ గా జాన్ హెచ్ ఉండగా అతడి కుమారుడు జాన్ టైసన్(32) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) గా గత నెల 2న నియామకమయ్యాడు.
అయితే జాన్ టైసన్ ఇటీవల పీకలదాకా మద్యం సేవించి ఓ పరిచయం లేని మహిళ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడే తన దుస్తులు విప్పి మంచంపై పడుకున్నాడు. అయితే ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చిన మహిళ ఇంట్లో ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళ సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతడు జాన్ టైసన్ గా గుర్తించారు. అతడిని నిద్రలేపే ప్రయత్నంగా మత్తు నుంచి తేరుకోలేదు. దీంతో అతడిని డిటెన్షన్ సెంటర్ కు తరలించారు. ఆ తర్వాత అతడి నుంచి 415 డాలర్ల బాండ్ తీసుకొని విడిచిపెట్టారు.
ఈ కేసు నిమిత్తం జాన్ టైసన్ డిసెంబర్ 1న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కాగా ఈ విషయంపై టైసన్ ఫుడ్స్ ఇప్పటిదాకా స్పందించకపోవడం గమనార్హం. ఇలాంటి సంఘటనలు సినిమాల్లో చూసినప్పుడు కామెడీ అనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో మాత్రం ఆ వ్యక్తి పరువు పోవడం ఖాయమని ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది.
సో మీలో ఎవరికైనా అతిగా తాగే అలవాటు ఉంటే మాత్రం గప్ చుప్ గా ఇంట్లో కానిచ్చేయండి.. లేదంటే తక్కువ మోతుదులో మాత్రమే తీసుకోండి గానీ.. ఇలా పక్కింట్లోకి వెళ్లి పడుకోవడం లాంటివి చేసి పరువు మాత్రం తీసుకోవద్దు.. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటారని భావిస్తూ ఇక సెలవు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.