పవన్ పార్టీకి వచ్చిన మద్దతు కంటే విమర్శలే ఎక్కువగా వింటున్నాం. ఆయన సిద్ధాంతాలపై పూర్తి క్లారిటీ ఇవ్వకపోవడం నుంచి ఆయన వ్యవహార శైలి వరకు అనేక కారణాలు దీనికి దారి తీసి ఉండొచ్చు. అయితే, కేసీఆర్ ను కలవడం ద్వారా పవన్ కళ్యాణ్ మరింత బదనాం అయ్యారు. ఆ రోజు నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ పై తాజాగా మరో గట్టి పంచ్ పడింది. తెలంగాణ సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ఆయనపై విరుచుకుపడ్డారు. అసలు పవన్ కళ్యాణ్ కు ఏం తెలుసు? ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా ? అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ గురించి తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకోకుండా కేసీఆర్‌ను పవన్ కు ఆశాకానికి ఎత్తేస్తున్నారని అసలు పవన్ కళ్యాణ్ మొదట నిజాలు తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ శాశ్వతంగా ఉండరు. కానీ తెలంగాణ శాశ్వతంగా ఉంటుంది. 2000 కోట్లు పెట్టి రూ.5 పెట్టి యూనిట్ కొని రైతులకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అవసరం లేదని ఒక అధికారి కూడా చేయగలడని చాడ వ్యాఖ్యానించారు. తెలంగాణ లో కరెంటు సృష్టించాడా? అప్పులు చేసి తెలంగాణపై భారం వేసి కరెంటు కొనుక్కువచ్చాడా? అన్నది తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ కేసీఆర్‌ను పొగడటం పవన్ అజ్ఞానమని ఆయన విమర్శించారు.
అసలు పవన్ పార్టీ జనసేనకు ఓ పద్ధతేం లేదన్నారు. ఆయన గోడమీద పిల్లి... ద్వంద వైఖరి అనుసరిస్తారు అని దారుణ వ్యాఖ్యలు చేశారు వెంటక్ రెడ్డి. జనాలను మభ్యపెట్టి వాళ్లు వీళ్లు పొగిడితే చూశావా మా కేసీఆర్ ఎంత గొప్పోడో అని టీఆర్ ఎస్ నేతలు గప్పాలు కొడుతున్నారు. కానీ రాష్ట్రంపై కేవలం కరెంటు వల్ల నెలకు రెండు వేల కోట్ల భారం పడుతున్న విషయాన్ని దాచిపెడుతున్నారని విమర్శించారు.