ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. బుల్లి తెర మీద తన ప్రవచనాలతో తెలుగు ప్రజల్ని విపరీతంగా ప్రభావితం చేసే అధ్యాత్మిక ప్రవచన వేత్త చాగంటి కోటేశ్వరరావుకు ఏపీ సర్కారు సలహాదారుగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సలహాలు అధ్యాత్మిక ప్రవచనకర్త ఎలాంటి సలహాలు ఇస్తారో చూడాలి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ప్రముఖుల వరుసలో ఉన్న చాగంటివారితో చాలాసేపు చంద్రబాబు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. అనంతరం ఆయన వేదిక మీదకు వచ్చారు. ఈ సందర్భంగా చాగంటిని పలు విధాలుగా పొగిడేసిన చంద్రబాబు.. ఉగాది వేడుకల్లో భాగంగా ఆయన్ను సత్కరించారు. చాగంటిని ప్రభుత్వ సలహాదారుగా ప్రకటిస్తూ పలువురిని ఆశ్చర్యానికి గురి చేశారు.
చాగంటి ప్రవచనాలు స్ఫూర్తిదాయకంగా ఉండటంతో పాటు.. ఎంతోమందికి సాయం చేస్తున్నాయని.. సమాజ హితానికి పనికి వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించాలన్న బాబు నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నదా? లేదంటే ముందే అనుకున్నదా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ప్రవచనాలు చెప్పే చాగంటి వారు చంద్రబాబు ప్రభుత్వానికి ఏ తరహా సలహాలు ఇవ్వనున్నారన్నది ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి.