సెలవు కోసం కరోనా నాటకం... చైనా ఉద్యోగికి జైలు

Update: 2020-03-15 01:30 GMT
కరోనా పేరు చెబితేనే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా హడలిపోతున్నాయి. కరోనా బారి నుంచి తన ప్రజలను రక్షించుకునేందుకు ఆయా దేశాలు ఇప్పుడు భారీ ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఈ ప్రణాళికల్లో భాగంగా ఏకంగా నెలల తరబడి సెలవులు ప్రకటిస్తున్నాయి. సినిమా హాళ్లను మూసేస్తున్నాయి. పాఠశాలలకు సెలవులు ఇచ్చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ ఉద్యోగి తన సెలవు కోసం, ఉద్యోగానికి సెలవు పెట్టి ఎంజాయ్ చేసేందుకు కరోనా సోకిందని చెప్పి నాటకమాడాడు. అయితే అతడికి నాటకమని తేలడం తో ఇప్పుడు మూడు నెలల జైలు శిక్షకు గురయ్యారు.

ఈ ఆసక్తికర ఘటన కరోనా ప్రస్థానం మొదలైన చైనాలోనే జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే... చైనాలో ఓ ఉద్యోగి పని నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేసుకున్నాడు. దీంతో తనకు కరోనా వైరస్ పాజిటివ్ ఉందంటూ యాజమాన్యానికి ఫోన్ చేసి చెప్పాడు. ఈ నేపథ్యంలో యాజమాన్యం అతడికి సెలవు ఇచ్చింది. మరోవైపు అతడికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే సదరు వ్యక్తి పనిచేసే ఆఫీసులో భయాందోళనలు నెలకొన్నాయి. మూడు రోజుల పాటు సిబ్బందికి సెలవులు ఇచ్చి ఆఫీసు మొత్తాన్ని శుభ్రపరిచారు.

ఆ తరువాత తమ సంస్థలోని ఓ ఉద్యోగికి కరోనా సోకిందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతడికి వ్యాధి ఎలా సోకింది..? అతడు ఏయే ప్రాంతాల్లో తిరిగాడు..? ఎవరిని కలిశాడు..? అనే వివరాలపై ఆరా తీసి.. వారిని చికిత్సకు తరలించాలని భావించారు. ఈ క్రమంలో అతడికి ఇంటికి వెళ్లారు. విచారణలో భాగంగా అతడికి కరోనా వైరస్ లేదని తేలడం తో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో పోలీసులు, సంస్థను తప్పుదోవ పట్టించినందుకు గానూ ఆ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష పడింది.
Tags:    

Similar News