జ‌గ‌న్ నా క‌న్న స‌హ‌న‌శీలురుః మండ‌లి చైర్మ‌న్

Update: 2021-05-20 15:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మండ‌లి చైర్మ‌న్ మొహద్ అహ్మద్ షరీఫ్ ప‌ద‌వీ కాలం ఈ నెల 31తో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇవాళ జ‌రిగిన బ‌డ్జెట్ స‌మావేశాల అనంత‌రం వీడ్కోలు కార్య‌క్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చైర్మ‌న్ ష‌రీఫ్‌.. ముఖ్యమంత్రి జగన్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంద‌న్న చైర్మ‌న్.. తన‌కు స‌హ‌నం ఎక్కువ అని అనుకున్నాన‌ని, కానీ.. జ‌గ‌న్ త‌న‌క‌న్నా ఎక్కువ‌ స‌హ‌న‌శీలుర‌ని కొనియాడారు. ఇందుకు.. మూడు రాజ‌ధానుల బిల్లుల ఘ‌ట‌నను ఉద‌హ‌రించారు. బిల్లుల వివాదం త‌ర్వాత ఓ కార్య‌క్ర‌మంలో తాము క‌లిశామ‌ని చెప్పారు.

అప్పుడు జ‌గ‌న్ త‌న‌ను ఆప్యాయంగా ష‌రీఫ్ అన్న అని ప‌ల‌క‌రించార‌ని, ఆ స‌మ‌యంలో ఎందుకు క‌ల‌త చెందార‌ని అడిగార‌ని గుర్తు చేసుకున్నారు. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. ‘‘ఇంత‌కు ముందు ఎప్పుడూ పెద్ద ప‌ద‌వులు చేప‌ట్టలేదు. ఒకేసారి ఎమ్మెల్సీ అయ్యాను. చైర్మ‌న్ అయ్యాను. అందువ‌ల్ల ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలోనే క‌ల‌త చెందాను’’ అని సీఎంకు చెప్పాన‌ని అన్నారు. త‌న‌ను అత్యంత గౌర‌వంగా చూసుకున్న ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌ని అన్నారు చైర్మ‌న్‌.

ఇదిలాఉండ‌గా.. ఈ నెలాఖ‌రుతో బీజేపీ అధ్య‌క్షుడు సోమూ వీర్రాజు, వైసీపీ సభ్యుడు దేవసాని చిన్న గోవింద్ రెడ్డి సైతం ప‌ద‌వీకాలం పూర్తి చేసుకోనున్నారు.





Full View

Tags:    

Similar News