అతి సర్వత్రా వర్జయేత్ అంటే ఇదేనేమో. రాజస్థాన్ లోని ఓ చాయ్ వాలా తన ఆరుగురు అల్లుళ్లకు కట్నంగా ఇచ్చిన ఎపిసోడ్ ఆయనకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అల్లుళ్లపై ప్రేమతో వందలు, వేలు కాదు.. లక్షలు కూడా దాటి ఏకంగా కోటికిపైనే తన కట్నంగా సమర్పించుకున్నాడు. అది కూడా రహస్యంగా ఏమీ ఇవ్వలేదు. పబ్లిక్ గా గ్రామస్థులంతా చూస్తుండగానే.. తన దగ్గర ఉన్న డబ్బుల కట్టలను లెక్కపెట్టి మరీ ఇచ్చాడు. ఈ వీడియో నెట్ లో వైరల్ అయింది.
అయితే ఈ తతంగం అంతా పడకూడని వారి కళ్లలోనూ పడింది. వాళ్లే ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు. తమకు పైసా పన్ను చెల్లించకుండా ఇంత మొత్తం ఇవ్వడమేంటని అధికారులకు ఒళ్లు మండింది. అంతే ఆ లీలా గుజ్జర్ అనే ఆ చాయ్ వాలా ఇంటికి నోటీసులు వచ్చాయి. అంత డబ్బు ఎక్కడిది? అది కూడా నగదు ఎలా వచ్చింది? దీనికి సంబంధించిన పత్రాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. ఇప్పుడు వారికి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక అతను తలపట్టుకున్నాడు. దీనికి బోనస్ గా పోలీసులు కట్నం కేసును కూడా నమోదు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/