ఓటుకు నోటు కేసులో తమ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించిన ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేసే దిశగా తెలుగుదేశం పార్టీ కదులుతోంది. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఇదే విషయమై క్లారిటీ ఇచ్చారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన భూమిక పోషించే, న్యాయవ్యవస్థపై వైసీపీ నేత జగన్, ఆయన పార్టీ సభ్యులు ఆరోపణలు చేయడం వారి అక్కసుని, అభద్రతాభావాన్ని తెలియచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటుకి నోటు కేసుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సంబంధం లేదని మొదట్నుంచీ చెబుతూనే ఉన్నామని చలమలశెట్టి అన్నారు. సచ్చీలుడైన చంద్రబాబునాయుడు విషయంలో, హైకోరు ఇచ్చిన తీర్పుని కించపరిచేలా, న్యాయమూర్తుల్ని అగౌరవపరిచేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడమే గాక, ఆధారాలు లేకుండా గుడ్డిగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ, తీర్పులు చెప్పేవారిని తప్పుపట్టడం వైసీపీ అజ్ఞానాన్ని సూచిస్తోందని రామానుజయ పేర్కొన్నారు. సాక్షి టీవీ చర్చా కార్యక్రమలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయమూర్తులను కించపరిచేలా మాట్లాడారని, ఆయన తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోకుంటే, నేను కోర్టుని ఆశ్రయిస్తానని రామానుజయ హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ, ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తోందని, నిత్యం అసత్య ఆరోపణలు చేసూ, తన పబ్బం గడుపుకోవాలని, ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షం బ్లాక్ మెయిల్ రాజకీయాలను మానుకోవాలని ఆయన హితవుపలికారు. జగన్ ధన దాహానికి, తన తండ్రి హయాంలో జరిగిన దోపిడీ కారణంగా ఎంతమంది నిజాయితీపరులైన అధికారులు జైలుపాలయ్యారో జగన్ కు తెలియదా అని రామానుజయ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించే నైతికత జగన్‌కు, ఆ పార్టీ సభ్యులకు లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా జగన్ మానసిక స్థితిపై సందేహంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత శనక్కాయల అరుణ వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి కొడుకుగా, ప్రధాన ప్రతిపక్షనేతగా హుందాగా వ్యవహరించాల్సిన జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని శనక్కాయల అరుణ ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయన మానసిక పరిస్థితిపై సందేహం కలుగుతోందని, ఇంకో రెండేళ్లు, ఒక్క సంవత్సరం మాత్రమే అంటూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయాన్ని జగన్ గుర్తించాలని, ఎన్నికల సమయానికి వారు మరలా ఆయనకు తగిన విధంగా ಬುದ್ದಿ చెబుతారని ఆమె తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేసే అర్హత, నైతికత జగన్ కు లేదనిచంద్రబాబు అనుభవం ముందు జగన్ ఎందుకూ పనికిరాడని ఆమె పేర్కొన్నారు.