తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి.. తాజాగా బీజేపీలోకి చేరిన ఈటల రాజేందర్ సూటి సవాలు విసిరారు. ఎవరి ఆస్తులు ఏమిటో విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. తన ఆస్తులపై విచారణకు సిటింగ్ లేదంటే సీబీఐతో విచారణకు సిద్దమని.. మరి.. మీరు మీ ఆస్తులపై విచారణకు సిద్దంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయిలో విచారణ జరిగితే.. ముఖ్యమంత్రి చెప్పినట్లు రాసిచ్చే అధికారులతో న్యాయం జరిగే అస్కారం లేదని.. తెలంగాణలో పక్షపాతంతో కూడుకున్న పరిస్థితులు.. దుర్మార్గంగా వ్యవహరించే పద్దతి ఉందన్నారు.
అందుకే తమ ఇద్దరి ఆస్తుల లెక్కల్ని తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదంటే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. తన మీద చేస్తున్న ఆరోపణలపైనా ఈటల స్పందించారు. తన వద్ద ఒక్క ఎకరం అసైన్డ్ బూమి ఉందని నిరూపించినా ముక్కు నేలకు రాస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
2005లో కిరాయికి ఇచ్చిన గోడౌన్లను ఇప్పుడు ఖాళీ చేయించారని ఈటల పేర్కొన్నారు. తన భూములు అన్నింటిపైనా వివాదం చేశారని.. ఇంత జరుగుతున్నా తాను భయపడటం లేదన్నారు. తన మీద ఉన్న కసితో చట్టాన్ని.. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి చేసిన ఆరోపణల్ని నిరూపించాలన్నారు. తన మీద చేసిన ఆరోపణలు నిరూపితం కాకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా? అని ప్రశ్నించారు. ఒకవేళ తనది తప్పని తేలితే దేనికైనా సిద్ధమన్నారు.
తాజాగా ఈటల మాటల్ని చూస్తే.. తరచూ తన మాటల్లో విచారణను కోరటం.. సీబీఐ ప్రస్తావన తేవటం కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే రానున్న రోజుల్లో కేసీఆర్ అండ్ కోకు సీబీఐ నుంచి తిప్పలు తప్పవా? అన్న సందేహం రాక మానదు. జరగబోయే దాని గురించి తన మాటలతో ఈటల హింట్ ఇస్తున్నారా? అన్న మాట వినిపిస్తోంది. ఏమైనా ఇప్పుడున్న విధంగా మాత్రం కేసీఆర్ కు రానున్న రోజులు ఉండే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.