తప్పులన్నవి చేయకూడదు. కానీ.. అందుకు భిన్నంగా చేస్తే.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కీలక స్థానాల్లో ఉన్న వారు మరింత జాగ్రత్తతో వ్యవహరించాలి. కానీ.. అదేమీ పట్టనట్లుగా తెలిసిన వారి విషయంలో రూల్స్ కు భిన్నంగా వ్యవహరిస్తే.. వ్యవస్థ ఎంత పెద్దవారినైనా కొన్నిసార్లు వదిలిపెట్టదు. ఆ విషయం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో కమ్ ఆ బ్యాంక్‌కు ఒక బ్రాండ్ గా కనిపించే చందాకొచ్చర్‌కు సైతం వర్తిస్తుందన్నది తాజాగా రుజువైంది.
ఐసీఐసీఐ బ్యాంక్.. వీడియోకాన్ కేసు దర్యాప్తు పూర్తి అయ్యే వరకూ చందాకొచ్చర్ సెలువుల్లో ఉండనున్నారు. ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని తాజాగా బోర్డు నిర్ణయించింది. చందాకొచ్చర్ స్థానంలో బ్యాంక్ సీవోవోగా సందీప్ బక్షిని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్ జీవిత బీమా విభాగానికి హెడ్ గా వ్యవహరిస్తున్న ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జూన్ 19 నుంచి ( ఈ రోజు నుంచి) ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీర్ఘకాలిక సెలవులో ఇంటికి వెళ్లే చందాకొచ్చర్ బ్యాంక్ కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
తన భర్తకు అనుకూలంగా వ్యవహరించేందుకు వీలుగా వీడియోకాన్ విషయంలో చందాకొచ్చర్ తీసుకున్న నిర్ణయాల మీద గడిచిన కొంతకాలంగా రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆరోఫలు ఎదురైనా.. ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోనప్పటికీ.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా కొచ్చర్ ను దీర్ఘకాలిక సెలవుపై ఇంటికి పంపటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బోర్డు తీసుకున్న నిర్ణయంపై చందాకొచ్చర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. ఒక బ్యాంకుకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఒక మహిళ.. చివరకు బోర్డు దీర్ఘకాలిక సెలవుపై ఇంటికి పంపుతూ నిర్ణయం తీసుకోవటం చూస్తే.. తప్పులు చేస్తే ఫలితం ఎప్పటికైనా అనుభవించక తప్పదన్నది మరోసారి రుజువైనట్లుగా అనిపించక మానదు.