దారుణం.. దుర్మార్గం.. మాటల్లో చెప్పలేని పైశాచికత్వం. భారతీయులు తల దించుకునే అమానవీయమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వేళ.. ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి అత్యాచారానికి గురైన ఉదంతం సంచలనంగా మారింది.
పంద్రాగస్టు వేడుకలకు హాజరై తిరిగి వస్తున్న వేళ చండీగఢ్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలోకి వెళితే.. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక తమ స్కూల్లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తోంది. దారిలో ఓ గుర్తు తెలీని వ్యక్తి ఆ పాపను అడ్డుకున్నాడు. బలవంతంగా అక్కడి దగ్గర్లోని పిల్లల పార్కులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
జరిగిన దారుణం గురించి ఇంటికి వెళ్లి పెద్దవాళ్లకు చెప్పటంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. దీంతో.. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ దుర్మార్గానికి గురైన రాక్షసుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.