వాలంటీర్లని వద్దన్న వారే ఉపయోగించమంటున్నారు !

Update: 2020-04-01 03:30 GMT
కరోనా వైరస్ ..దీని ప్రభావం ఎలా ఉంది అన్న విషయం కాసేపు పక్కన పెడితే ..ఈ కరోనా వైరస్ దేశంలో ఎన్నో మార్పులకి శ్రీకారం చుట్టుంది. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా కుటుంబంతో కూడా ప్రశాంతగా గడపలేని ఎంతోమంది ఈ కరోనా పుణ్యమా అని పూర్తిగా కుటుంబంతోనే గడుపుతున్నారు. అలాగే దేశాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నారు. దేశ సంప్రాదయాలని కూడా చాలా బాగా పాటిస్తున్నారు. అలాగే ఈ కరోనా రాజకీయ నేతలలో కూడా భారీ మార్పులు తీసుకువచ్చింది. కొంతమంది ప్రత్యర్థులు కలిసిపోయారు. ఒక విధానాన్ని వ్యతిరేకించిన వారు .. తిరిగి కరోనా నియంత్రణలో ఆ యంత్రాంగాన్ని వాడుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి.

ఏపీలో విపక్ష నేత చంద్రబాబు మంగళవారం నాడు ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాశారు. కరోనా నియంత్రణ కోసం ప్రకటించిన లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను నివారించాలన్నది చంద్రబాబు రాసిన లేఖ యొక్క సారాంశం. లాక్ డౌన్ వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ,నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం అల్లాడిపోతున్నారని , డబ్బున్న వారు ఎలాగోలా గడిపేస్తున్నా కూడా ఏ రోజుకారోజు సంపాదన మీద ఆధారపడి బతుకుతున్న వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.

ఈ నేపథ్యంలోనే పేదలకు రేషన్ సప్లై చేయడం ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యం కావాలన్నారు చంద్రబాబు నాయుడు. రేషన్ సరుకుల కోసం పెద్ద సంఖ్యలో జనం బయటికి రావడం కూడా కరోనా వ్యాప్తి దృష్ట్యా మంచిది కాదన్న చంద్రబాబు రేషన్ సరుకుల పంపిణీకి వాలెంటీర్ల వ్యవస్థను వినియోగించుకోవాలని సూచించారు చంద్రబాబు. కొన్ని చోట్ల గ్రామాల్లో బయోమెట్రిక్ ద్వారా రేషన్ ఇస్తుండటం తో , సర్వర్ కారణంగా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని , ఎమెర్జెన్సీ టైం కాబట్టి బయోమెట్రిక్ నుంచి మినహాయింపునివ్వాలని, వాలెంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని చంద్రబాబు తన లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.

ఈ వాలంటీర్ల వ్యవస్థని అయితే ఉపయోగించుకొని అని చంద్రబాబు చెప్పారో ..అదే వాలంటీర్ల వ్యవస్థ పై ..అయన మొదటి నుండి మండిపడుతూనే ఉన్నారు. గ్రామ, వార్డు వాలెంటీర్ల వ్యవస్థను వైసీపీ కార్యకర్తలకు ఉపాధి అంటూ వ్యతిరేకించిన చంద్రబాబు, సడన్‌ గా ఆ వ్యవస్థను వినియోగించుకోవాలంటూ సలహా ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏదేమైనా కూడా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం భేష్ అని చంద్రబాబు కూడా ఒప్పుకున్నట్టే. ఈ వాలంటీర్ల వ్యవస్థ ని ఇప్పటికే కేరళ , మహారాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడానికి సన్నద్ధం అవుతున్నాయి.
Tags:    

Similar News