ఈ మాట‌లేంది చంద్ర‌బాబూ!

Update: 2020-01-13 06:36 GMT
'ఆడ వాళ్ల‌లా గాజులు తొడుక్కొమ్మంటారా.. ' అంటూ తెలుగుదేశం అధినేత పోలీసుల‌ను ప్ర‌శ్నించార‌ట‌. త‌ను బైక్ ర్యాలీ చేయాల‌నుకుంటే, ఆ బైక్ కీస్ ను పోలీసులు తీసుకోవ‌డంపై చంద్ర‌బాబు నాయుడు తీవ్రంగా ఫైర్ అయిపోయిన‌ట్టుగా తెలుస్తూ ఉంది. అనుమ‌తి లేద‌ని, 144 సెక్ష‌న్ ఉంద‌ని, ర్యాలీలు తీయ‌డానికి వీల్లేద‌ని పోలీసులు చెప్పినా చంద్ర‌బాబు నాయుడు విన‌క‌, వారిపై విరుచుకుప‌డిపోయిన‌ట్టుగా తెలుస్తూ ఉంది.

అయితే గ‌త కొన్నాళ్లుగా చంద్ర‌బాబుకు ఇది కొత్త కాదు. అన్నింటికీ చంద్ర‌బాబు నాయుడు తీవ్రంగా ఫైర్ అయిపోతూ ఉన్నారు. అయితే.. ఇలాంటి స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు అనుచిత భాష‌ను ఉప‌యోగిస్తూ ఉన్నారు. జెండ‌ర్ ఇన్ ఈక్వాలిటీని హైలెట్ చేస్తూ చంద్ర‌బాబు నాయుడు స్పందిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇది వ‌ర‌కూ సీఎంగా ఉన్న‌ప్పుడు కూడా చంద్ర‌బాబు నాయుడు అలాగే మాట్లాడారు. అనుచిత‌మైన భాష‌ను ఉప‌యోగించారు. కోడలు కొడుకును కంటానంటే అత్త వ‌ద్దంటుందా.. అంటూ స్త్రీ వివ‌క్షా పూరిత‌మైన మాట‌ల‌ను మాట్లాడాడు చంద్ర‌బాబు నాయుడు. నేటి త‌రంలో కూడా అలా ఆడ‌వాళ్ల‌ను త‌క్కువ చేసి మాట్లాడ‌టం చంద్ర‌బాబు నాయుడుకు ఎంత వ‌ర‌కూ రైటు అనిపిస్తోందో కానీ.. గాజులు తొడుక్కోవ‌డాన్ని త‌క్కువ చేస్తూ చంద్ర‌బాబు నాయుడు తాజాగా స్పందించారు.

అయితే ఆడ‌వాళ్ల ను చంద్ర‌బాబు నాయుడు అలా కించ‌ప‌ర‌చాల్సిన అవ‌స‌రం లేదు. గాజులు తొడుక్కోవ‌డం ఆడ‌వాళ్ల సంప్ర‌దాయం. అంతే కానీ.. దానికీ మ‌గ‌త‌నానికి ముడిపెడుతూ మాట్లాడ‌టం.. మ‌రీ థ‌ర్డ్ గ్రేడ్ మాట‌. అందులోనూ ఇటీవ‌లే చంద్ర‌బాబు నాయుడి భార్య త‌న గాజును విరాళంగా ఇచ్చింది. ప్లాటినం గాజును విరాళంగా ఇచ్చి రాజ‌ధాని ఉద్య‌మ విరాళాల‌ను ఆమె మొద‌లుపెట్టింది. ఆ వ‌సూళ్లు బాగానే సాగుతున్న‌ట్టుగా ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో కూడా చంద్ర‌బాబు నాయుడు గాజులు తొడుక్కోవ‌డం అంటూ త‌క్కువ‌జేసి మాట్లాడ‌టం అంత బాగున్న‌ట్టుగా లేదు. త‌న భాష‌ను చంద్ర‌బాబు నాయుడు వీలైనంత త్వ‌ర‌గా మార్చుకుంటే ఆయ‌న‌కే మంచిద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.
Tags:    

Similar News