గన్నవరంపై బాబు ఫోకస్.. బరిలో లోకేష్?

Update: 2019-11-05 07:13 GMT
గన్నవరం ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీమోహన్ ఇటీవల తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే జగన్ సర్కారును దెబ్బకొట్టాలని కసిగా ఉన్న చంద్రబాబు ఈ టీడీపీ అభ్యర్థి రాజీనామా చేసిన సీటులో బలమైన అభ్యర్థిని దించాలని యోచిస్తున్నారట..

వంశీని టీడీపీలోనే కొనసాగాలని ఎంత చెప్పిన వినకుండా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఖాళీ అయ్యే ఆ సీటును గెలిచి అధికార వైసీపీ దూకుడు కళ్లెం వేయాలని చంద్రబాబు భావిస్తున్నాడట.. వైసీపీ ప్రచాండ గాలి ఉప ఎన్నికల్లో కొట్టుకుపోయిందని నిరూపించడానికి చంద్రబాబు రెడీ అవుతున్నారట..

వచ్చే ఆరునెలల్లో గన్నవరంలో ఉప ఎన్నికలు ఖాయం.. ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ సీనియర్లతో జరిగిన సమావేశంలో గన్నవరంలో పోటీచేసే అభ్యర్థుల షార్ట్ లిస్ట్ ను తయారు చేశారట.. ఇందులో ప్రధానంగా కృష్ణ జిల్లాలో ప్రముఖ నేతలైన గన్నవరం సీటును ఆశిస్తున్న గద్దె అనురాధతోపాటు మాజీ మంత్రి దేవినేని ఉమ, దేవినేని అవినాష్ పేర్లు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

అయితే జగన్ కు షాకివ్వలాంటే బలమైన నేత కావాలని.. ఇక్కడ వైసీపీని ఓడించి ఆరు నెలల్లోనే జగన్ సర్కారును డిఫెన్స్ లో పడేయాలని చంద్రబాబు, టీడీపీ నేతలు చర్చించుకున్నారట.. ఈ నేపథ్యంలో గన్నవరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ను బరిలోకి దింపాలని నేతలంతా బాబుకు సూచించినట్టు తెలిసింది. దీనికి బాబు కూడా ఆలోచనలో పడిపోయినట్టు తెలిసింది.

టీడీపీకి కంచుకోట అయిన గన్నవరంలో నారాలోకేష్ ను బరిలోకి దింపితే విజయం తథ్యమని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారట.. ఇసుక కొరత, టీడీపీ ఆందోళనల నేపథ్యంలో వైసీపీ సర్కారును గన్నవరంలో ఓడించడానికి లోకేష్ సరైన అభ్యర్థి అని టీడీపీ భావిస్తోందట..

అయితే మంగళగిరిలోనే గెలవని నారా లోకేష్ గన్నవరంలో గెలుస్తాడా లేదా అన్నది సందేహంగా మారింది. గన్నవరంలోనూ లోకేష్ ఓడిపోతే భావి టీడీపీ నేతగా ఆయనను ఎవరూ గుర్తించరు.. చంద్రబాబు తర్వాత ఆయన వారసుడిగా ఎవరూ పట్టించుకోరు. ఈ నేపథ్యంలో ఈ కత్తి మీద సాము లాంటి టాస్క్ లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News