అమరావతిలో శ్రీవారు..

Update: 2019-01-31 09:06 GMT
ఆంధ్రప్రదేశ్  నూతన రాజధాని అమరావతిలోనూ ఇక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకోవచ్చు. తిరుమల శ్రీవారి తరహా ఆలయ నిర్మాణానికి ఏపీ సర్కారు అడుగు పడింది. గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం వెంకపాలెంలో ప్రభుత్వం సేకరించిన 25 ఎకరాల స్థలంలో ఆలయం నిర్మించనున్నారు.  ఈ మేరకు ఈ స్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆగమోక్తంగా క్రతువులను నిర్వహించారు.

దాదాపు 150 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఫిబ్రవరి 10న ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కృష్ణా నది తీరంలో ప్రతిష్టాత్మకంగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. చాళుక్కుల, చోళుల నాటి వాస్తు, నిర్మాణ శైలిని ఈ ఆలయ నిర్మాణానికి వాడుతున్నారు.

ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణం, బీజావాపనం కోసం చంద్రబాబు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడి ప్రాంతంలో సీఎం నాగలితో భూమి దున్ని నవధాన్యాలు చల్లారు. టీటీడీ పండితులు గోపూజ, కలశపూజ నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


Tags:    

Similar News