కంచుకోట‌ల్లో ప‌రిస్థితి య‌థాత‌థం.. టీడీపీ వ్యూహం మారాల్సిందే!

Update: 2021-11-17 17:30 GMT
ఏపీ అధికార ప‌క్షం టీడీపీకి కంచుకోట‌ల వంటి నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అదేస‌మ‌యంలో జిల్లాలు కూడా ఉన్నాయి. నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి, చిత్తూరు వంటి జిల్లాలు టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్న జిల్లాలుగా పేర్కొంటారు. దీంతో ఎప్పుడు ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. 2019 మిన‌హా.. అంత‌కు ముందు వ‌ర‌కు టీడీపీ గెలుపు గుర్రం ఎక్కేది. అంతేకాదు.. టీడీపీ ఎవ‌రిని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నిల‌బెట్టినా.. ప్ర‌జ‌లు అఖండ మెజారిటీతో విజ‌యం సాధించేలా చేసేవారు. అయితే.. 2019లో ప‌రిస్థితి మారిపోయింది. నేతా గ‌ణం చేసుకున్న స్వ‌యంకృతానికి తోడు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ పై పెల్లుబుకిన సానుభూతి.. ప‌నిచేసింది.

ఫ‌లితంగా టీడీపీ కంచుకోట‌ల్లో సైకిల్‌కు పంక్చ‌ర్లు ప‌డ్డాయి. అయితే.. అప్ప‌ట్లో ఇదంతా కూడా జ‌గన్‌పై వ‌చ్చిన సానుభూతి తాలూకు ఎఫెక్ట్ అని.. త‌న‌కు తాను స‌ర్దిచెప్పుకొన్న టీడీపీ అధినేత.. ఇదే పంథాను కొన‌సాగించారు. మ‌రి.. రెండున్న‌రేళ్ల త‌ర్వాత‌.. జ‌రిగిన గ‌త మార్చిలోను.. ఇప్పుడు జ‌రిగిన స్థానికంలోనూ.. ఇంకా జ‌గ‌న్‌పై సానుభూతి ప‌వ‌నాలు ఉన్నాయ‌నే అనుకోవాలా?  ఎందుకంటే.. టీడీపీ ఆయా కంచుకోట ల్లో.. చిత్తుగా ఓడిపోయింది క‌నుక‌!  అదేనిజ‌మైతే.. ఇక‌, జ‌గ‌న్ సానుభూతిని త‌గ్గించే వ్యూహాలు టీడీపీకి లేన‌ట్టే భావించాలి. కానీ.. ఒక‌వైపు ప‌న్నులు పెంచుతున్నారు. విద్యుత్ చార్జీలు పెరిగాయి. అదేస‌మ‌యంలో ఉపాధి లేద‌ని.. నిరుద్యోగులు గ‌గ్గోలు పెడుతున్నారు.

రాష్ట్రంలో అప్పుల కుప్ప‌గా మారింది. మ‌రోవైపు.. ఎయిడెడ్ విద్యాసంస్థ‌లు విలీనం వ‌ద్దంటూ.. విద్యార్థులు రోడ్డెక్కారు. మ‌రి ఇన్ని జ‌రుగుతుంటే.. ఇంకా జ‌గ‌న్‌పై సానుభూతి ఎక్క‌డిది?  అంతేకాదు.. ఒక వేళ ప్ర‌భు త్వ ప‌థ‌కాల‌ను తీసుకుంటున్న వారిలో ఉంటే సానుభూతి ఉండొచ్చు. మ‌రి మెజారిటీ ప్ర‌జ‌లు ఆవేద‌న లోనూ.. ఆందోళ‌న‌లోనూ ఉన్నార‌ని.. టీడీపీ నాయ‌కులే చెబుతున్నారు. కానీ, ఇఇప్పుడు కంచుకోట‌ల్లోనూ టీడీపీకి ప్ల‌స్ కాలేదు. రెండున్న‌రేళ్లు కూడా గ‌డిచిపోయిన త‌ర్వాత‌.. టీడీపీ పుంజుకోలేక పోయిన అంశం.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతేకాదు.. నేత ల‌వ్య‌వ‌హార శైలిపై కూడా అనేక సందేహా లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

మ‌రి ఇప్ప‌టికైనా.. చంద్ర‌బాబు.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి ప‌రిశీలిస్తారా? అనేది కీల‌కంగా మారింది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు నేత‌ల‌పై ఆధార‌ప‌డ్డారు. సీనియ‌ర్లు చెప్పిందే నిజ‌మ‌ని అనుకుంటున్నారు. కానీ.. ఇప్పుడు.. ప‌రిస్థితి స్ప‌ష్టంగా  క‌ళ్ల‌కు క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో మున్ముందు వ్యూహాత్మ‌క ల‌క్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగితేనే త‌ప్ప‌. టీడీపీ గెలిచే ప‌రిస్థితి లేద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News