ఒకవైపు పేరుకేమో కాంగ్రెస్ పార్టీకి సన్నిహితుడిగా నడుచుకుంటున్నాడు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ లోకేష్ బాబును కలిసి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. రాహుల్ ను కలవకుండా ఈయన తిరిగి రానే రావడం లేదు. రాహుల్ ను దేశంలోని ఇతర పార్టీల వాళ్లు పట్టించుకోకపోయినా చంద్రబాబు నాయుడు మాత్రం చాలా దగ్గరగా మెలుగుతూ ఉన్నాడు. ఎన్నికల తర్వాత తను కాంగ్రెస్ పక్షమే అని చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నాడు.
అయితే ఏపీ లెవల్లో మాత్రం కాంగ్రెస్ తో పొత్తుకు నో చెప్పాడు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా సోలోగా పోటీ చేసుకోవడానికి రెడీ అవుతోంది. అయితే కాంగ్రెస్ కు ఆ ఆనందాన్ని కూడా మిగల్చడం లేదు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ పార్టీలో మిగిలిన కొద్దో గొప్పో నేతలను కూడా చంద్రబాబు నాయుడు తన పార్టీలోకి ఈడ్చేసుకుంటున్నాడు.
ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలను తెలుగుదేశంలోకి చేర్చుకున్నాడు చంద్రబాబు. ఇక మరోవైపు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డితో చర్చలు జరుపుతూ ఉన్నాడు. తాజాగా మరో కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ కు కూడా బాబు ఎర్త్ పెట్టాడు. ఆయనను కూడా తన పార్టీలోకి చేర్చుకుంటున్నట్టుగా సమాచారం.
వీళ్లే కాదని.. మరి కొందరు కాంగ్రెస్ నేతలను చంద్రబాబు నాయుడు తన పార్టీలోకి చేర్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా వరసగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలను చంద్రబాబు నాయుడు తన వైపుకు తిప్పుకుంటున్నాడు. ఒకవైపు కాంగ్రెస్ కు మిత్రపక్షంగా వ్యవహరిస్తూనే చంద్రబాబు నాయుడు ఇలా చేస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు అంటే ఇంతేనని.. ఆయన తీరు ఇలానే ఉంటుందని.. విశ్లేషకులు అంటున్నారు.