మరికొద్ది రోజుల్లో నాలుగు రాష్ట్రాలకు.. ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికరమైన అంశం ఇప్పటివరకూ ఏమీ లేదన్న కొరత ఒకటి ఉండేది. అది కాస్తా తాజాగా వెల్లడైన ఒక ప్రకటనతో తీరిపోయింది. ఇన్నేసి రాష్ట్రాల్లో ఎన్నికలంటే ఆసక్తి లేకపోవటానికి కారణం లేకపోలేదు. ఒక్క తమిళనాడు మినహా మిగిలిన చోట్ల ఎవరు పవర్ లోకి వస్తారన్న విషయంపై స్పష్టమైన అంచనాలు ఉండటమే.
ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై బీజేపీ ప్రయోగించిన అస్త్రం ఇప్పుడు దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. దీదీ కమ్ ఫైర్ బ్రాండ్ అయిన మమతపై బరిలోకి దింపేందుకు స్వాతంత్ర్య సమరయోథుడు.. అసలుసిసలు బెంగాలీ అయిన సుభాష్ చంద్రబోస్ మనమడు చంద్రకుమార్ బోస్ ను బరిలోకి దింపాలని డిసైడ్ చేయటం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరి మధ్య ఎన్నికల పోరు మొత్తం ఎన్నికలకే హైలెట్ గా నిలిచే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. బెంగాలీలు ఎవరివైపు మొగ్గుతారో చూడాలి.