ఏపీలో రాజకీయ పరిణామాలు గంటగంటకూ మారిపోతేనే ఉన్నాయి. పొత్తులు తెగిన దగ్గరినుంచీ.. రెండు పార్టీల మధ్య సంబంధాలు కూడా గొప్పగా లేవు. ఇలాంటి నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల గడువు ముంచుకు వచ్చేసింది. రాజ్యసభ సీట్లకు నామినేషన్లు వేయడానికి సోమవారం ఆఖరి రోజు. రాష్ట్రంలో మూడు ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలాల ప్రకారం తెలుగుదేశానికి రెండు సీట్లు మాత్రమే దక్కుతాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కు ఒక సీటు దక్కే అవకాశం ఉంది. ఆ స్థానానికి నెల్లూరుకు చెందిన పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పేరును వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించేశారు. తెదేపా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది.
అభ్యర్థులను ఎంపిక చేయడం అంటే.. చంద్రబాబునాయుడు ముందు చాలాసవాళ్లే ఉన్నాయి. ప్రత్యేకించి.. ఇప్పుడున్న ఎంపీలో సీఎం రమేష్ పదవీకాలం పూర్తవుతోంది. చంద్రబాబును చాలా రకాలుగా ప్రభావితం చేయగల సత్తా ఉన్న, ఆయనకు అనేక రకాలుగా కీలకమైన అనుచరుడిగా వ్యవహరించే సీఎం రమేష్ కు మరోసారి అవకాశం కల్పించడానికి నో చెప్పే సాహసం చంద్రబాబు చేయకపోవచ్చుననే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
అంటే ఇక మిగిలినదెల్లా ఒక్కటే సీటు. దీనికోసం ఆశలు పెట్టుకుంటున్న వాళ్లు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ఇంకో వైపు నుంచి తెలంగాణ తెలుగుదేశం నాయకులు తమకు కూడా ఆ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణలో తెదేపా తిరిగి బతికి బట్టకట్టే పరిస్థితి రావాలంటే.. ఏదో ఒక పదవిలో ఒక నాయకుడినైనా ఉంచడం అవసరం అని వారు చంద్రబాబును కోరుతున్నారు. కానీ ఉన్నది ఒకటే సీటు అయితే.. దానిని చంద్రబాబు ఎలా సర్దుబాటు చేస్తారనేది అనుమానమే.
మామూలుగా అయితే.. మూడో అభ్యర్థిని కూడా రంగంలోకి దించే ఆలోచన చంద్రబాబుకు నిన్నటిదాకా ఉండేది. మూడో అభ్యర్థి కూడా గెలవాలంటే.. భాజపా బలాన్ని కూడా కలుపుకున్న తరువాత.. కేవలం రెండే ఓట్లు తగ్గుతాయి. ఆ మేరకు వైకాపా నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించినా.. లేదా, సెకండ్ ప్రయారిటీ ఓట్లతే మేనేజి చేసినా గెలవచ్చు అనేది వారి భావనగా ఉండేది. అయితే భాజపాతో బంధం చెడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓట్లు తెదేపాకు దక్కే ఛాన్స్ పోయింది. దీంతో మూడో సీటుకు గండం వచ్చినట్టే. ఆ ఆశలు వదలుకుని కేవలం రెండు సీట్లకు పోటీచేసి వాటిని దక్కించుకుంటే చాలునని, పరువుగా ఉంటుందని.. పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.