విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఏపీ విపక్ష నేతపై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ముందుగా ఊహించినట్లే ఈ విషయాన్ని రాజకీయక్రీడగా మార్చేసిన ఏపీ అధికారపక్షం.. ప్రతిపక్ష నేతపై దాడి జరిగిందన్న కనీస సానుభూతి లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.
ఒక ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే అయ్యో అనటం మానేసి..నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే చెల్లుతుందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. తమ పార్టీ అధినేత జగన్ పై హత్యకు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే పక్కా ప్లాన్ తో కుట్ర చేసినట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది.
ఈ కుట్రలో ప్రధాననిందితుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే.. మరో ప్రధాన నిందితుడు డీజీపీ ఠాకూర్ గా ఆరోపిస్తున్నారు. ఎందుకిలా? అంటే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సుదీర్ఘ వివరణ ఇస్తున్నారు. వారి వాదనను వారి మాటల్లోనే చూస్తే..
+ ‘‘జగన్ పై జరిగిన హత్యాయత్నం వెనుక అసలు సూత్రధారి చంద్రబాబే అయినపుడు ఆయన ఆదేశించిన విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందని మేమెలా విశ్వసిస్తాం?’’ సంఘటన జరిగిన గంటలోపే ఈ హత్యాయత్నాన్ని వైఎస్సార్ సీపీపైకి నెట్టేసి డీజీపీ చేతులు దులిపేసుకోవడం, ఆ తరువాత చంద్రబాబునాయుడు వెకిలిగా మాట్లాడ్డం చూస్తే ఇంకా వీరి విచారణను ఎలా నమ్మాలి?
+ అందుకే మేం కేంద్ర దర్యాప్తు సంస్థల చేత నిష్పాక్షిక విచారణను కోరుతున్నాం. రాష్ట్ర డీజీపీ ఠాకూర్ ముఖ్యమంత్రి చెబుతున్నట్లు ఆడుతున్నారు.
+ ముఖ్యమంత్రి వ్యవహారశైలి ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ఆయన ఉన్మాదంతో మాట్లాడుతున్నారు. అసలు ప్రతిపక్ష నేతను ఉద్దేశించి విలేకరుల ముందే ఆయన వాడిన పదజాలం చూస్తే సీఎంకి ఎంత అక్కసు ఉందో... కడుపులో జగన్‌పై ఎంతటి విషం దాచుకుని ఉన్నారో అర్థం అవుతోంది.
+ జగన్ పై దాడి ఉదంతంలో చంద్రబాబు ఓ సీఎంగా ప్రతిపక్ష నేత పట్ల ప్రదర్శించాల్సిన కనీస సంప్రదాయాన్ని.. మర్యాదను పాటించలేదు.
+ వాడు - వీడు అని ప్రతిపక్ష నేతను ఉద్దేశించి మాట్లాడ్డం చూస్తే చంద్రబాబుకు ఏ కోశానా మానవత్వం అనేదే లేదని, ఆయన మొహంలో క్రూరత్వమే కనపడుతోంది.
+ విమానాశ్రయంలోకి అసలు కత్తి ఎలా వచ్చిందనే ప్రశ్నను పక్కకు నెట్టేసి చంద్రబాబు హేళనగా మాట్లాడ్డం చూస్తే ఇక ఈ ప్రభుత్వం నియమించే విచారణ ఎలా సాగుతుందో తెలిసిపోయింది.
+ ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయి.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తుందని.. వాస్తవాల్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుందని అనుకున్నాం. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నంపై ఏ మాత్రం సానుభూతి లేకుండా అదేదో డ్రామా కింద అధికారపక్షం కొట్టి పారేయడం తీవ్ర ఆక్షేపణీయం.
+ అందుకే ఈ ఉదంతంపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారణను ప్రతిపక్ష నేతతో పాటు పార్టీ నేతలు కూడా మాట్లాడేందుకు నిరాకరించాం.
+ రాష్ట్ర పోలీసు యంత్రాంగం అధిపతి అయిన డీజీపీ ఒక వైపు, సీఎం మరోవైపు జగన్ పై జరిగిన దాడి ఘటనపై తేలికగా, హేళన పూరితంగా మాట్లాడ్డం చూశాక.. పార్టీ శ్రేణులు టీడీపీ ప్రభుత్వ పాలనలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదనే అభిప్రాయానికి వచ్చాయి.
+ నిందితుడు శ్రీనివాస్‌ను జగన్ అభిమానిగా చెప్పడం, ప్రచారం కోసమే ఈ పనికి పాల్పడ్డాడని నిర్థారించడం ఒక ఎత్తు అయితే., చంద్రబాబు కూడా అదే రీతిలో జగన్‌పైనే నిందలు వేస్తూ మాట్లాడ్డం చూశాక.. ప్రభుత్వమే జగన్ హత్యకు కుట్ర పన్నిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
+ విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్ యజమానిని విచారించాలని తామెంత డిమాండ్ చేస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవటం లేదు? మార్పింగ్ ఫోటోల్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వాస్తవాల్ని ఎందుకు తొక్కి పెడుతున్నారు? నిందితుడి లేఖ విడుదలలో జాప్యం.. విడుదలయ్యాక ఆ లేఖ ఉన్న తీరుపై ఉన్న అనుమానాల్ని నివృతి చేసింది లేదు.