క‌ర్నూలు నేత‌ల‌కు త‌లంటారే.. అంత‌ సైలెంట్‌గా..!

Update: 2022-11-30 06:06 GMT
ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. వ‌రుస పెట్టి అంద‌రికీ వైసీపీ అధిష్టానం త‌లంటేసిందా?  అంటే.. ఔన‌నే అంటున్నారు క‌ర్నూలు జిల్లా వైసీపీ నాయ‌కులు. అంత‌ర్గ‌త స‌మావేశాల్లో దీని గురించి పెద్ద ఎత్తున నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవ‌ల టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు క‌ర్నూలులో ప‌ర్య‌టించారు. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌లు తండోతండాలుగా ఆయ‌న‌న‌ను చూసేందుకు వ‌చ్చారు. ఆయ‌న చెప్పింది కూడా విన్నారు.

వాస్త‌వానికి దానికి ముందు రోజు ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలోనూ చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. అయితే, ఇక్క‌డ ఆయ‌న కాన్వాయ్‌పై రాళ్ల దాడి జ‌రిగింది. పైగా.. పెద్ద‌గా జ‌నాలు కూడా రాలేద‌ని వైసీపీ అధిష్టానానికి తెలిసింది.

దీంతో ఇక్క‌డి నాయ‌కుల‌ను ప్ర‌శంసించిన‌ట్టు స‌మాచారం. అయితే, మ‌రుస‌టి రోజు క‌ర్నూలులో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబుకు అక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అంతేకాదు.. గంట‌ల త‌ర‌బ‌డి ఆయ‌న కోసం ఎదురు చూశారు.

ఈ ప‌రిణామాల‌తో టీడీపీ పుంజుకుంది. ఇక‌, చంద్ర‌బాబుకూడా క‌ర్నూలు నేత‌ల‌ను ప్ర‌త్య‌కంగా మంగ‌ళ‌గిరి కి పిలిచి మ‌రీ అభినందించారు. పార్టీ పుంజుకుంటోంద‌ని , దీనికి క‌ర్నూలులో జ‌రిగిన స‌భ‌లు రోడ్ షోలే అద్దం ప‌డుతున్నాయ‌ని, మ‌న కోసం ప్ర‌జ‌లు వేచి చూస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఈ ప‌రిణామా ల‌పై వైసీపీలో క‌ల్లోలం చెల‌రేగింది. ఇదేంటి..క‌ర్నూలులో క్లీన్ స్వీప్ చేసిన చోట ఇంత ప్ర‌జాద‌ర‌ణ ఎలా ల‌భించింద‌నే విష‌యంపై వైసీపీ నాయ‌కులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డారు.

ఈ క్ర‌మంలోనే క‌ర్నూలులో భారీ మార్పులు చేశారు. అదేస‌మ‌యంలో జిల్లా ఇంచార్జ్ ప‌ద‌వి నుంచి ఎమ్మెల్యేను త‌ప్పించారు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డి నాయ‌కుల‌పై ఏదో డౌట్ కొట్టిన పార్టీ అధిష్టానం.. కీల‌క‌మైన నాయ‌కుల‌ను తాజాగా తాడేప‌ల్లికి పిలిచి మ‌రీ.. అస‌లు ఏం జ‌రిగింద‌ని ఆరాతీశారు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌పైజ‌గ‌న్ సీరియ‌స్‌గానే వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు స‌హా క‌ర్నూలు నాయ‌కులు కూడా చెబుతున్నారు. ఉంటే ఉండండి పోతో పోండి! అని తేల్చేశార‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News