వైఎస్సార్‌ జిల్లా మార్పుపై చంద్రబాబు హాట్‌ కామెంట్స్‌ వైరల్‌!

Update: 2022-12-02 09:17 GMT
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన మహానాడు, మినీ మహానాడు, బాదుడే బాదుడు కార్యక్రమాలు సక్సెస్‌ కావడంతో టీడీపీలో జోష్‌ నెలకొంది. ఇప్పుడు కొత్తగా 'ఇదేం ఖర్మ మనకు' పేరుతో కొత్త కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రోడ్‌ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

విజయవాడలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ యూనివర్సిటీగా జగన్‌ ప్రభుత్వం పేరు మార్చడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను తలుచుకుంటే వైఎస్సార్‌ జిల్లాకు ఆ పేరును తీసేస్తానని.. అయితే తనకు సంస్కారం అడ్డు వస్తుందని అన్యాపదేశంగా జగన్‌కు సంస్కారం లేదని తేల్చిపారేశారు.

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పేరు మార్చడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. కావాలంటే 2024లో మళ్లీ ముఖ్యమంత్రి అయితే వైఎస్‌ఆర్‌ కడప పేరును కడపగా మారుస్తానని రెండు రోజుల క్రితం ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు ప్రకటనపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఎట్టకేలకు చంద్రబాబు తన తాజా ప్రకటనతో అన్ని ఊహాగానాలకు తెరపడింది. జగన్‌లాగా వైఎస్సార్‌ జిల్లా పేరు మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

వైఎస్‌ఆర్‌ కడప జిల్లాగా పేరు మార్చే ఆలోచన తనకు లేదని చంద్రబాబు చెబుతున్నప్పటికీ, కొన్ని కీలకమైన సంక్షేమ పథకాలతోపాటు జగన్‌ సర్కార్‌ పేరు మార్చిన ప్రాంతాలకు తప్పకుండా తిరిగి పాత పేర్లు పెడతానని చంద్రబాబు చెప్పకనే చెప్పారు.

''స్కీమ్‌ లేదా స్థలం పేరు మార్చడం గొప్ప విజయం కాదు. జగన్‌ లాగా కాకుండా, మన సంప్రదాయాలను పాటించే సంస్కారం నాకు ఉంది'' అని చంద్రబాబు చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News