ఇపుడిదే విషయమై రాష్ట్రంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. మొన్నటి శుక్రవారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. తన భార్య భువనేశ్వరితో పాటు కుటుంబాన్ని వైసీపీ కించపరిచిందని మీడియా సమావేశంలో చంద్రబాబునాయుడు భోరున ఏడ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు ఏడుపును పక్కనపెట్టేస్తే ఆ తర్వాత విడతల వారీగా టీడీపీ నేతలు+ఇతర పార్టీలనేతలు+ఎన్టీయార్ కుటుంబ సభ్యులు మీడియా ముందుకొస్తున్నారు.
అసెంబ్లీలో తాము భువనేశ్వరి పేరును ఎక్కడా ప్రస్తావించలేదని చంద్రబాబే కావాలని డ్రామాలు ఆడుతున్నారంటు మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు ఎదురుదాడి చేస్తున్నారు. ప్రభుత్వం+అధికారపార్టీ నేతలు ఏమి చెబుతున్నా చంద్రబాబు అండ్ కో మాత్రం ఏమీ పట్టించుకోవటంలేదు. చంద్రబాబు ఏడుస్తున్న వీడియోని పదే పదే సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
చంద్రబాబు ఏడుస్తున్న వీడియోలను వైరల్ చేయటం ద్వారా సెంటిమెంటును రగల్చాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికిప్పుడు సెంటిమెంటును పండించటం వల్ల ఉపయోగం ఏమిటో వాళ్ళకే తెలియాలి. ఎన్నికలేమీ ఇపుడు లేవు. మరెందుకు తమ్ముళ్ళు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారో అర్ధం కావటంలేదు. తమ్ముళ్ళు ఒక విషయం మరచిపోయినట్లున్నారు. అదేమిటంటే సెంటిమెంటు వల్ల మాత్రమే ఓట్లు రావని.
ఒకసారి చరిత్రను గుర్తు చేసుకుందాం. పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎయిర్ పోర్టుకెళ్ళారు. అప్పుడు హఠాత్తుగా కత్తితో దాడి జరిగింది. అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాతే 2019 ఎన్నికలు జరిగాయి.
విచిత్రమేమిటంటే జగన్ పైన దాడి తర్వాతే ఎన్నికలు జరిగినా వైజాగ్ సిటీలోని నాలుగు సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా వైసీపీ గెలవలేదు. వైజాగ్ సిటీలోనే జగన్ పై దాడి జరిగినా వైజాగ్ సిటీలోని నాలుగు సీట్లలో ఎందుకని ఒక్క సీటులో కూడా గెలవలేదు ? అలాగే తెలంగాణాలోని దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో దివంగత ఎంఎల్ఏ సోలిపేట లింగారెడ్డి భార్యనే టీఆర్ఎస్ పోటీలోకి దింపినా ఓడిపోయారు.
ప్రతిసారి సెంటిమెంటుతోనే ఓట్లు రాలవన్న విషయం పై ఘటనల్లో స్పష్టమైంది. ఎందుకంటే 2003లో అలిపిరి దగ్గర చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ దాడి ఘటన కారణంగా తమకు ఓట్లవర్షం కురుస్తుందని ప్రభుత్వాన్ని చంద్రబాబు రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. కానీ ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. కాబట్టి ఇపుడు కూడా చంద్రబాబు అండ్ కో సెంటిమెంటును మాత్రమే కాకుండా క్షేత్రస్ధాయి పరిస్దితులను దృష్టిలో ఉంచుకుంటే మంచిది.