ఉద్యోగుల‌పై బాబు కోపం- వేతనాలు కట్ !

Update: 2019-01-23 12:15 GMT
సమైక్యాంధ్ర విడిపోయి ఐదు సంవత్సారలు కావొస్తోంది. హైదారాబాద్‌లో ఆంధ్రాకు చెందినా యంత్రాంగం అంతా కూడా తరలి వెళ్లిపోయింది. ఈ మధ్యనే హైకోర్టును కూడా అమరావతికి తరలించారు. అయితే సమైక్యాంధ్రలో హైదరాబాద్‌ లో పనిచేసిన వారు కొంతమంది హైదరాబాద్‌ లో స్ధిరపడిపోయారు. అటువంటి వారు కొందరూ అమరావతి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. అలాంటి వారిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు.

ఇక పై అమరావతి రాను అని మొండికేస్తున్న ఉద్యాగుల వేతానాలలో కోత తప్పదని బాబు చెప్పారు. ఇప్పటికే చాలసార్లు వార్నింగ్ ఇచ్చామని, ఆఖరిసారిగా వార్నింగ్ ఇచ్చి జీతాలు నిలిపి వేయావలసిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారికి తాకీదులు కూడా పంపినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఏపీ అడ్వకేట్ జనరల్ కార్యాలయం, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కార్యలయం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం. ఏపీ ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లీనరీ ప్రోసీడింగ్స్ కార్యలయం,పే అండ్ అకౌంట్స్ కార్యాలయం ఇలా కొన్ని కార్యాలయాలు ఇంకా హైదరాబాద్‌ లోనే కొనసాగుతున్నాయి.

ఈ కార్యాలయాలన్నిటికీ ఈ నెల 15వ తేదీలోగా అమరావతికి రావాలని నోటీసులు పంపినట్లు సమాచారం. చెప్పిన గడువులోగా ఉద్యోగులు, అధికారులు అమరావతి రాకపోతే వారికి వచ్చే నెలలో జీతాలు చెల్లించవద్దని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆయా శాఖల ఉన్నతాధికారులు పరుగులు పెడుతున్నట్లు సమాచారం.


Tags:    

Similar News