రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్సుకతను రేపిన కుప్పం మున్సిపాలిటిలో వైసీపీ విజయం సాధించింది. 25 వార్డుల్లో వైసీపీ 19 చోట్ల గెలిస్తే, టీడీపీ 6 వార్డులతో సరిపెట్టుకుంది. వైసీపీ గెలుపుకు సానుకూలమైన అనేక కారణాలున్నప్పటికీ టీడీపీ ఓటమికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా ? స్థానికంగా ఉన్న కొందరు నేతల మీద పార్టీ క్యాడర్లో కానీ జనాల్లో కానీ విపరీతంగా ఉన్న వ్యతిరేకతేనట.
అవును పార్టీ క్యాడర్లో, జనాల్లో ఎవరిమీదైతే తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఆ నేతలే ఇపుడు ఎన్నికల్లో అన్నీ తామై తిరిగారట. మరలాంటి నేతలను చంద్రబాబునాయుడు, లోకేష్ ఏరికోరి ఎందుకు ముందు నిలిపారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని ఇంకెవరో చెప్పటం కాదు. చంద్రబాబు సానుకూలురతో పాటు ప్రధాన మీడియాలో కూడా దీనిపై చర్చిస్తోంది. పోలింగ్ ముందే అలాంటి కొందరు నేతలపై కుప్పంలో మకాంవేసిన ఓ నేత చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారట.
కాస్త చరిత్రలోకి వెళితే టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా అపరిమితమైన అధికారాలను అనుభవించిన వాళ్ళు కొందరున్నారట. డబ్బు సంపాదన విషయంలో వీళ్ళే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారట. ఈ నేతలు నియోజకవర్గంలోని మిగిలిన సీనియర్లలో ఎవరిని కూడా పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. క్యాడర్ తో కానీ మామూలు జనాలతో కానీ వీళ్ళకు ఎలాంటి సంబంధాలు లేవు. అచ్చంగా అధికారాన్ని అనుభవించటం, డబ్బు సంపాదించుకోటమే వీళ్ళ పనిగా ఉండేదట.
2019 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత మొదటిసారి చంద్రబాబు కుప్పంకు వచ్చినపుడు నేతలు+క్యాడరంతా కలిసి సదరు నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేశారట. దాంతో సదరు నేతలంతా చంద్రబాబు సమక్షంలోనే పార్టీకి రాజీనామాలు చేసేశారు. అయితే చంద్రబాబు ఆ రాజీనామాలను వారించి మిగిలిన నేతలను+క్యాడర్ ను సముదాయించారు. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటానని బహిరంగంగా హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు వైఖరిలో మార్పు రాలేదు. దాంతో సదరు నేతలు కూడా హ్యాపీ అయిపోయారు.
అయితే పంచాయితీ ఎన్నికల్లో సదరు నేతలెక్కడా అడ్రస్ కనబడలేదట. దాంతో మిగిలిన నేతలు+క్యాడర్ కూడా పట్టించుకోలేదు. దాంతో ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే. ఇదే సీన్ మళ్ళీ పరిషత్ ఎన్నికల్లో కూడా రిపీటైందట. మళ్ళీ మళ్ళీ సదరు నేతల ప్రస్తావన చంద్రబాబు ముందుకొస్తున్నా పట్టించుకోలేదట. అలాంటిది ఇపుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు సదరు నేతలనే మళ్ళీ ముందుకు తెచ్చారట.
చంద్రబాబు చేష్టలతో ఒళ్ళుమండిపోయిన మిగిలిన నేతలు, క్యాడర్ కాడిని పక్కన పడేశారట. ఇదే సమయంలో అధికారంలో ఉన్నపుడు తమను పట్టిపీడించిన నేతలు ఎన్నికల్లో కనబడేటప్పటికీ జనాలకు కూడా మండిపోయిందట. దాని ఫలితమే ఇపుడు ఫలితం మీద పడిందని చంద్రబాబును సానుకూలంగా ఉన్న మీడియానే విశ్లేషించింది. అంటే ఈ విశ్లేషణను చూస్తే వరుస ఓటములతో కూడా చంద్రబాబుకు జ్ఞానోదయం కాలేదని అర్ధమవుతోంది. తాను మారానని చెప్పుకోవటమే కానీ ఏమాత్రం మారలేదని నిరూపితమైంది.