ఢిల్లీ టూర్ తోనే గడగడ... ?

Update: 2021-12-02 01:30 GMT
డరల్ సిస్టమ్ లో రాష్ట్రాలకు ఎంత శక్తిమంతంగా ఉన్నా కూడా కేంద్రమే ఇంపార్టెంట్. ఎంతటి పవర్ ఫుల్ లీడర్స్ ముఖ్యమంత్రులుగా ఉన్నా ఢిల్లీ తో సయోధ్యను నెరిపితీరాలి. లేకపోతే రాద్ధాంతానికి సిద్ధపడాలి. ఏపీ విషయానికి వస్తే జగన్ కేంద్రంతో బాగానే ఉంటున్నట్లు లెక్క, ఆయన మమతా బెనర్జీ మాదిరిగా బాహాటంగా తలపడడంలేదు, ఇక కేసీయార్ మాదిరిగా కొన్ని సందర్భాలో అయినా కేంద్రాన్ని ఘాటుగా విమర్శించడమూ లేదు. జగన్ సేఫ్ జోన్ లో ఉంటూ సేఫ్ గానే పాలిటిక్స్ చేస్తున్నారు.

అయితే ఏపీలో విపక్షం మాత్రం జగన్ కి ఢిల్లీకి దూరం పెంచాలని, ఆయన రాజకీయాన్నిమోయని భారంగా చేయాలనుకుని గట్టిగానే చూస్తున్నారు. అలా చేయని ప్రయత్నం లేదు. నాడు చంద్రబాబుని బీజేపీని విడగొట్టి గరిష్టంగా లబ్ది పొందిన వైసీపీ తరహాలోనే తాము పాలిటిక్స్ చేయాలని చంద్రబాబు సహా తమ్ముళ్ళంతా భావిస్తున్నారు. ఇక ఏపీలో చూసుకుంటే ఎటువంటి ఎమోషనల్ ఇష్యూ తీసుకున్నా కొదీ రోజులలోనే తుస్సుమనిపోతోంది. ఇక పోరాటాలకు ఏపీలో పెద్ద పీట వేసే సీన్ కూడా లేదు.

ఎన్నికలు అయితే చాలా దూరంలో ఉన్నాయి. దాంతో జగన్ని కదిలించి కృంగిపోయేలా చేయాలీ అంటే మరోసారి ఢిల్లీ టూర్ పెట్టుకోవడమే బెటర్ అని చంద్రబాబు డిసైడ్ అయ్యారని టాక్. ఢిల్లీ టూర్ లో బాబు కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోం మంత్రిని కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇపుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. దాంతో ఈ సమావేశాల్లో అంతా అందుబాటులో ఉంటారు. దాంతో ఇదే సరైన సమయమని బాబు భావిస్తున్నారుట.

అందువల్ల వీలు చూసుకుని వచ్చే వారం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి బాబు ప్రిపేర్ అవుతున్నారని అంటున్నారు. బాబుకు అక్కడ ఈసారి ఎలాంటి ఆశాభంగం కలగకుండా ప్రధాని, అమిత్ షా అపాయింట్మెంట్స్ ని కన్ ఫర్మ్ చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారుట. ఈ ఇద్దరు నేతలను బాబు ముఖాముఖీ కలిస్తే చాలు ఏపీలో వైసీపీ గింగిరాలు కొట్టడం ఖాయమని టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికి మూడేళ్ళకు పైన అయింది, మోదీ, అమిత్ షాలను బాబు మీట్ అయి. ఒక వేళ అదే జరిగితే జాతీయ మీడియా సైతం హైలెట్ చేస్తుంది.

ఒకసారి వారి అపాయింట్మెంట్ దొరికి వారిని కలసివస్తే చాలు ఇక అంతా సానుకూలమే అవుతుందన్న లెక్కలేవో కూడా చంద్రబాబుకు ఉన్నాయట. ఎటు నుంచి ఎటు తిప్పినా కూడా ఏపీ బీజేపీకి టీడీపీతో దోస్తీ తప్ప మరేమీ మార్గం లేదు. అయితే ఆ దోస్తీకి నిచ్చెన మెట్లు రెండున్నరే ఏళ్ళకు ముందే వేసుకుంటే ఇప్పటి నుంచే జగన్ ని పొలిటికల్ గా బాగా వీక్ చేయవచ్చు అన్నదే టీడీపీ ఎత్తుగడ. మరి చంద్రబాబు ఢిల్లీ టూర్ అంటేనే ఆసక్తి కరమే. ఇక ఆయనకు మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే కనుక అది అతి పెద్ద రాజకీయ సంచలనమే. దాంతో బాబు ఢిల్లీ టూర్ తో వైసీపీని గడగడలాడించడం ఖాయమే అంటున్నారు తమ్ముళ్ళు.


Tags:    

Similar News