పవన్ కల్యాణ్ ఇచ్చిన రెండు వారాల గడువు అర్థం లేనిదిగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇసుక కొరతను తీర్చాలంటూ ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ ఈ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లో పరిస్థితిని చక్కదిద్దకపోతే.. అంటూ పవన్ ఆ హెచ్చరికను జారీ చేశారు.
అయితే వర్షాలు, వరదల నేపథ్యంలో ఇసుక కొరత ఏర్పడింది. ఇలాంటి పరిణామాల్లో.. ప్రకృతి కొంత తెరపిని ఇస్తే తప్ప ఇసుక అందుబాటులోకి రావొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే..పవన్ హెచ్చరికకు ఎలాంటి విలువా లేదు.
ఇక విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ కల్యాణ్ ప్రసంగం రొటీన్ గా డొల్లగా సాగింది. ఎన్నికల ముందు ఎలా మాట్లాడాడో ఇప్పుడూ అలాగే మాట్లాడారాయన. ఇది ప్రధానంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును నిరుత్సాహ పరిచిందని టాక్!
పవన్ కల్యాణ్ ను ఇప్పుడు ఉసిగొల్పింది కూడా చంద్రబాబు నాయుడే అనేది ప్రముఖంగా వినిపించే అభిప్రాయం. చంద్రబాబు నాయుడుకు పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు అని వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. చంద్రబాబు హయాంలో పవన్ కల్యాణ్ ఏ వ్యవహారంలోనూ ఘాటుగా స్పందించింది లేదు. ఇప్పుడు మాత్రం అప్పుడే స్పందించేశారు.
ఇలాంటి నేపథ్యంలో పవన్ పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో వ్యవహరిస్తూ ఉన్నారనే అభిప్రాయాలున్నాయి. ఆ సంగతలా ఉంటే.. స్థూలంగా పవన్ కల్యాణ్ ప్రసంగం చంద్రబాబును కూడా మెప్పించలేదట. అందుకు కారణం ఏమిటంటే.. ఇసుక కొరతకు వరదలు కారణం కాదనేది తెలుగుదేశం వాదన. శాండ్ మాఫియా అంటోంది తెలుగుదేశం పార్టీ. టీడీపీ హయాంలో ఇసుకను పూర్తిగా మాఫియా కంట్రోల్ చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే కొరత ఏర్పడిన నేపథ్యంలో అదంతా మాఫియా పని అని చంద్రబాబు నాయుడు వాదిస్తూ ఉన్నారు.
అయితే పవన్ ఆ వాదనను వినిపించలేదు. శాండ్ మాఫియా ఊసే ఎత్తలేదు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నట్టుగా టాక్.పూర్తిగా తను మాట్లాడినట్టే మాట్లాడాలని చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ విషయంలో ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టున్నాడు!