ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు రోజులు కూడా గడిచిపోయాయి. సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుండే ..ఎప్పటిలాగానే వైసీపీ -టీడీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రతిపక్షం ఆరోపణలు ..ప్రభుత్వం విమర్శలు అన్నట్టుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా , ఇప్పటికే అసెంబ్లీ లో ఉల్లి సమస్య పై , అలాగే అత్యంత కీలకమైన మహిళా సంరక్షణపై , అలాగే రేషన్ బియ్యం పై చర్చలు జరిగాయి.
ఈ చర్చల సందర్భంలో ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకున్నారు.దీనితో మూడు రోజులుగా అసెంబ్లీ వాడివేడీగానే ముందుకు సాగుతుంది. ఇక మూడో రోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు .. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ వైసీపీ నేతలు బాబు పై రెచ్చిపోయారు. అలాగే చంద్రబాబుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. కానీ , స్పీకర్ మాత్రం ..బాబు వ్యాఖ్యలని అయన విజ్ఙతకె వదిలేస్తున్నా అంటూ సభని జరిపించారు.
ఇక తరువాత వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు.. స్వయానా తన బావమరిది, వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం రోజా అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ... బాలయ్య బాబుకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ ఆమె కామెంట్ చేయడంతో టిడిపి ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు కళాకారులకు తీరని అన్యాయం చేస్తున్నారని, అందులో భాగంగానే హిందూపూర్ నుంచి శాసనసభ కు ఎన్నికైన నటుడు నందమూరి బాలకృష్ణకు సభలో మాట్లాడే అవకాశం చంద్రబాబు ఇవ్వడం లేదని రోజా ఆరోపించారు. తన అనుచర వర్గాన్ని ప్రభుత్వంపైనా, అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనా ఉసి గొల్పుతున్న చంద్రబాబు.. బాలకృష్ణ లాంటి కళాకారులకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవడం విడ్డూరంగా వుందని రోజా చెప్పుకొచ్చారు.