ఆ మంట‌లే వైసీపీ ప్ర‌భుత్వాన్ని కాల్చేస్తాయ్‌!! మాచ‌ర్ల టాపిక్‌పై చంద్ర‌బాబు ఫైర్‌

Update: 2022-12-17 13:30 GMT
ప‌ల్నాడు జిల్లా మాచర్లలో జ‌రిగిన వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల వివాదం, త‌ర్వాత చోటు చేసుకున్న దారుణ వ్య‌వ‌హారంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫైర‌య్యారు. పోలీసుల సహకారంతో వైసీపీ రౌడీ మూకలు మరోసారి టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డాయ‌ని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.  వైసీపీ గూండాలను వదిలేసి టీడీపీ కార్యకర్తల పై పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడం, జూలకంటి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయానికి నిప్పుపెట్టడం దారుణమని చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంత జ‌రుగుతుంటే ఎస్పీ, డీజీపీ ఎక్కడున్నారని ప్ర‌శ్నించారు. ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.  మాచర్ల ఘటనకు ఇంతకింత మూల్యం చెల్లించక తప్పదన్నారు. మాచర్ల మంటలు సీఎం జగన్‌తో పాటు ఆయన ప్రభుత్వాన్ని దహించడం ఖాయమని చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో హెచ్చరించారు. అంతకుముందు గుంటూరు డీఐజీకి ఫోన్ చేసి తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మ‌రోవైపు మాచ‌ర్ల ఘ‌ట‌న‌పై  నారా లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలనకి నిదర్శనమని ధ్వజమెత్తారు. దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసిన పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలపై లాఠీఛార్జ్ చెయ్యడం, జూలకంటి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు. వైసీపీ విధ్వంసకాండకు అంత‌కంత బ‌దులు తీర్చుకుంటామ‌ని లోకేష్ శ‌ప‌థం చేశారు.

మాచ‌ర్ల‌ ఘటనకు హోం మంత్రి, డీజీపీ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మాచర్ల ఘటన ఉద్దేశ పూర్వ‌కంగానే చేశార‌ని.. టీడీపీ నేత‌ల‌ను కావాల‌నే ఇబ్బందులు పెడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. దీనిని డీజీపీ సీరియ‌స్‌గా తీసుకుని.. వైసీపీ నేత‌ల‌పై కేసులు పెట్టాల‌న్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News