పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబునాయుడు తమ్ముళ్ళకు టార్గెట్ ఫిక్స్ చేశారు. మామూలుకు భిన్నంగా మాట్లాడిన చంద్రబాబును చూసి తమ్ముళ్ళే హాస్చర్యపోయారు. మైకు దొరికితే చాలు తన గొప్పదనం గురించి, ఎదుటి వాళ్ళ తప్పుల గురించే చంద్రబాబు ఎక్కువగా మాట్లాడుతుంటారు. అలాంటిది ఈ సమావేశంలో తమ్ముళ్ళపై విరుచుకుపడిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి తమ్ముళ్ళదే బాధ్యతగా మండిపోయారు.
అయితే ఏ ఒక్కరిని పేరుపెట్టి బాధ్యుడిని చేయని చంద్రబాబు తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో తెగించి పోరాడాలని పిలుపిచ్చారు. సాధారణ ఎన్నికల్లోపు వచ్చే అతిపెద్ద ఎన్నిక ఇదే అని స్పష్టంగా చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో నేతలు చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇందుకోసం గతంలోనే ఐదుగురు సభ్యులతో కమిటి వేసిన విషయాన్ని గుర్తుచేశారు.
పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో కబుర్లు చెప్పినట్లు కూకుండా నేతలు తమ సత్తా చూపించాలని కచ్చితంగా చెప్పారు. ఇకనుండి విధేయతని, మొహమాటమనే సమస్యే లేదన్నారు. ఉపఎన్నికల్లో తెగించి పార్టీని గెలిపించిన వాళ్ళకే భవిష్యత్తులో గుర్తింపు ఉంటుందని స్పష్టంగా చెప్పేశారు. క్షేత్రస్ధాయిలో జనాలతో మమేకం కాకుండా కబుర్లతో కాలక్షేపం చేయాలంటే కుదరదని వార్నింగ్ ఇచ్చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్ళాలన్నారు. ఉపఎన్నికలో గెలుపు కోసం మొత్తం లోక్ సభ నియోజకవర్గాన్ని 75 క్లస్టర్లుగా విభజించినట్లు తెలిపారు. ప్రతి క్లస్టర్లోను ఓ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు కూడా చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ తాను, చినబాబు ఏమి చేస్తారో మాత్రం చెప్పలేదు. కమిటిలో చినబాబు లోకేష్ కూడా ఉన్నారు కానీ ఇంతవరకు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిదిలోని నేతలతో ఒక్క సమావేశం కూడా పెట్టలేదు.
నేతలతో సమావేశాలు పెట్టి చంద్రబాబు కబుర్లు చెప్పటం మానేసి ఎన్నిక అయ్యేంతవరకు చినబాబును తిరుపతిలోనే క్యాంపు వేయమని చెబితేనే ఏదైనా వర్కవుటవుతుంది. ఎందుకంటే కమిటిలో సభ్యులంతా జనబలం లేని వాళ్ళే. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఐదుసార్లు వరుసగా ఓడిపోయారు. బీద రవిచంద్రయాదవ్ ఇంతవరకు ఒక్క ఎన్నికలో కూడా పోటీచేయలేదు. పనబాక కృష్ణయ్య పోటీ చేసిన ఎన్నికల్లో ఎప్పుడూ గెలవలేదు.
అమరనాధ్ రెడ్డి వైసీపీలో నుండి టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత ఘోరంగా ఓడిపోయారు. పైగా ఆయనకు తిరుపతి లోక్ సభ పరిధితో ఏమీ సంబంధం లేదు. ఇక చినబాబు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కమిటిలో అచ్చెన్న ఒకడే గట్టినేత. కానీ ఆయనకు తిరుపతితో సంబంధమే లేదు. కాబట్టి ఎంతో కష్టపడితే కానీ ఫలితం వచ్చే అవకాశం లేదు.