వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని.. గట్టిగా నిర్ణయించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. కొన్నా ళ్లు గా కసరత్తు ముమ్మరం చేసినవిషయం తెలిసిందే. ఇప్పటికేనియోజకవర్గాల వారీగా ఆయన నాయకు లతో చర్చలు చేస్తున్నారు. మండలాల వారీగా కూడా.. నాయకులతో భేటీ అవుతున్నారు. ఇదంతా కూడా .. పార్టీలో ఒక విధమైన ఊపు తెచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నాయకులకుబాగానేవార్నింగ్ కూడా ఇస్తున్నారు.
అదేసమయంలో కొన్ని జిల్లాలపై చంద్రబాబు బాగా ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయాలనేది.. చంద్రబాబు వ్యూహంగా ఉంది. వీటిలో ముఖ్యంగా.. ప్రకాశం జిల్లా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత ఎన్నికల్లో ఇక్కడ.. జగన్ సునామీని తట్టుకుని.. మరీ.. 4 నియోజకవర్గాల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో .. మొత్తం ఉమ్మడి జిల్లాను కైవసం చేసుకునేలా చంద్రబాబు పక్కా ప్లాన్ రచించారని అంటున్నారు.
పైగా.. ఇప్పుడున్న నాయకులు కూడా.. ఇదేకసితో పనిచేయాలని భావిస్తున్నారు. ఒంగోలులో ఇప్పటికే టీడీపీ విజయం ఖరారైందని అంటున్నారు. దర్శిలో విజయాన్ని రాసిపెట్టుకోవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా నాలుగు సిట్టింగు స్థానాలకు ఢోకాలేదు. కనిగిరిలో విజయంఖాయమనేవాదన వినిపిస్తోంది. గిద్దలూరులోనూ.. కొంచెం కష్టపడితే.. టీడీపీదేవిజయం అంటున్నారు. ఇలా.. ప్రతి నియోజకవర్గంపైనా.. చంద్రబాబు ఫోకస్ పెంచారు.
ఆయా నేతలను అలర్ట్ చేయడంతోపాటు.. గెలుపు వ్యూహాలను కూడా వివరిస్తున్నారట. నిజానికి ప్రకాశం జిల్లాలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. దీనిని యాక్టివ్ః చేయాలని.. ఇప్పటికేచర్యలు చేపట్టారు. అదేవి ధంగా ప్రస్తుత వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ప్రజలకు మధ్యగ్యాప్ పెరిగింది. ఈ నేపథ్యంలో దీనిన పార్టీకి అనుకూలంగా మార్చాలనేది.. చంద్రబాబు వ్యూహం. ఇది కనుక సక్సెస్ అయితే.. ప్రకాశం మొత్తం టీడీపీగుప్పిటలోకి వచ్చేస్తుందని అంచనావేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.