త‌మ్ముళ్ల‌కు బాబు ఇచ్చిన కొత్త బాధ్య‌త‌లు ఇవే!

Update: 2019-06-12 04:43 GMT
ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం అనంత‌రం తీవ్ర‌మైన నిరాశ‌.. నిస్పృహ‌ల్లోకి జారిపోయింది తెలుగుదేశం పార్టీ.  గ‌డిచిన కొద్ది రోజులుగా స‌మావేశం అవుతున్న చంద్ర‌బాబు.. ఏపీ అసెంబ్లీ ప్రారంభానికి కాస్త ముందుగా తెలుగుదేశం శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌తో భేటీ అయిన ఆయ‌న‌.. అసెంబ్లీలోనూ.. మండ‌లిలోనూ ప‌ద‌వుల్ని ప్ర‌క‌టించారు.

తాజాగా నిర్ణ‌యించిన ప్ర‌కారం అసెంబ్లీలో టీడీపీ నేత‌గా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. శాస‌న‌స‌భాప‌క్ష ఉప నేత‌లుగా అచ్చెన్నాయుడు.. గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి.. రామానాయుడుల‌ను ఎంపిక చేశారు. పార్టీ విప్ గా బాల వీరాంజ‌నేయ స్వామిని సెలెక్ట్ చేశారు.

ఇక‌.. మండ‌లిలో  టీడీఎల్పీ నేత‌గా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడ్ని ఎంపిక చేశారు. ఉప నేత‌లుగా డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌.. సంధ్యారాణి.. గౌరువాని శ్రీ‌నివాసులను నియ‌మించ‌గా.. విప్ గా బుద్దా వెంక‌న్న‌ను ఎంపిక చేశారు. టీడీఎల్పీ ట్రెజ‌ర‌ర్ గా మ‌ద్దాలి గిరికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.


Tags:    

Similar News