ఏపీ అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జరిగింది. వ్యవసాయ రంగంపై చర్చ వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య కామెంట్లు, కౌంటర్లు నడిచాయి. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య వాగ్వాదం సాగింది. చంద్రబాబు మాట్లాడుతుండగానే స్పీకర్ తమ్మినేని సీతారాం మైక్ కట్ చేశారు. ఇరువైపుల నుంచి పెద్దఎత్తున నినాదాలు చేశారు. అరగంటపైగా ఈ గొడవే కొనసాగింది.
కాగా, సభలో పరిణామాలపై చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందారు. అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. సభ్యులకు నమస్కరిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. సభలో తన భార్య గురించి మాట్లాడడంపై తీవ్ర భావోద్వేగానికి గురైన బాబు.. కన్నీళ్లు పెట్టుకున్నారు. సభలో తన కుటుంబం గురించి మాట్లాడడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మళ్లీ గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని టీడీపీ అధినేత శపథం చేశారు. ముఖ్యమంత్రి గానే సభలో అడుగుపెడతానన్నారు.
8వ సారి ఎమ్మెల్యేను.. హేమాహేమీలతో పనిచేశా
సభలో వైసీపీ సభ్యులు పలు ఆరోపణలు చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. 8 సార్లు ఎమ్మెల్యే అయిన తాను హేమాహేమీలతో పనిచేశానని పేర్కొన్నారు.
అంతేకాక.. గురువారం సభలో ‘‘తనను చూడాలని ఉందని.. బహుశా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భారంతో అసెంబ్లీకి రాలేదేమో’’సీఎం జగన్ అనడాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. గతంలో పెద్దపెద్ద నాయకులతో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నా.. అప్పట్లోనూ, నిన్నటి సీఎం జగన్ వ్యాఖ్యలను వ్యకిగతంగా తీసుకోలేదని చంద్రబాబు అన్నారు.
కానీ, శుక్రవారం తన భార్యపై కూడా ఆరోపణలు చేశారని వాపోయారు. దీంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇదే సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం.. చంద్రబాబు మైక్ కట్ చేయడంతో ఆవేదనకు గురయ్యారు. తాను స్టేట్ మెంట్ ఇవ్వాలనుకున్నా ఇవ్వనివ్వలేదని.. మీకో నమస్కారం అంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగు పెడతానంటూ భీషణ ప్రతిన చేస్తూ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీ పతనం ప్రారంభమైందంటూ వైసీపీ సభ్యులను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబును అనుసరిస్తూ బయటకు వెళ్లిపోయారు.
సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
మీడియా సమావేశం నిర్వహించనున్న బాబు
అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను వివరించనున్నారు.
నాడు వైఎస్ హయాంలో..
2006లో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలోనూ ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, అధికార పక్ష సభ్యులకు తీవ్ర వాగ్వాదం నడిచింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై సాగిన సుదీర్ఘ చర్చలో టీడీపీ ఎమ్మెల్యేలు గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఓ దశలో తీవ్ర అసహనం, ఆగ్రహానికి గురైన వైఎస్ఆర్.. చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించారు. ఇది అప్పట్లో్ పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత తన మాటల్లో తప్పుంటే క్షమాపణ కోరుతున్నట్టు వైఎస్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
అసెంబ్లీ బహిష్కరణే అధికార మార్గం
1990 లో ఎన్టీఆర్, 2017లో వైఎస్ జగన్, ఇప్పుడు చంద్రబాబు.. అసెంబ్లీ బహిష్కరణ ప్రకటన చేశారు. చిత్రమేమంటే.. వీరిలో ఎన్టీఆర్, జగన్ తర్వాతి ఎన్నికల్లో విజయం సాధించి సీఎంలయ్యారు. తమిళనాడులోనూ ఇదే తరహాలో అసెంబ్లీ బహిష్కరణ రాజకీయాలు సాగడం గమనార్హం.