ఆమంచి బాబుని బాగా ఇబ్బంది పెడుతున్నాడు

Update: 2019-02-24 06:11 GMT
ప్రకాశం జిల్లాలో చీరాల నియోజకవర్గానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్క డ ఓట్లు అనేవి కులాల వారీగా పడతాయి. పార్టీలకు అసలు సంబంధమే ఉండదు. ప్రజలకు వ్యక్తిగతంగా ఎవరు తెలుసో, ఎవరు అందుబాటులో ఉంటారో చూసుకుని ఓట్లు వేస్తుంటారు. ఇక ఇలాంటి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి తన సత్తా ఏంటో చూపించారు ఆమంచి కృష్ణమోహన్‌. ఆమంచి కృష్ణమోహన్‌ చీరాలఎమ్‌ ఎస్‌ ఓ. దాదాపు 90 శాతం కేబుల్‌ ప్రసారాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. అన్నింటికి మించి చీరాలలో బలమైన కాపు నాయకుడు. అందుకే.. చీరాల ఆమంచికి కంచుకోట.
            
గత ఎన్నిక్లలో ఇండిపెండెంట్‌ గా గెలిచిన ఆమంచి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. మరి అక్కడ ఏమైందో ఏమో కానీ.. నెల రోజుల క్రితం టీడీపీని కాదని వైసీపీలో చేరారు. తనని అణగదొక్కటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో పార్టీ మారినట్లు చెప్పారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత  చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీంతో.. సీఎం చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చేసింది. ఎలాగైనా సరే ఆమంచిని చీరాలలోనే ఓడించి బుద్ధి చెప్పాలని ఫిక్స్‌ అయ్యారు. కానీ సరైన అభ్యర్థే దొరకడం లేదు. దీంతో.. బాపట్ల లోక్‌ సభ నియోజక వర్గ పరిథిలో ఉండే అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించినా కానీ చీరాలను మాత్రం ప్రకటించలేదు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే.. కరణం బలరాంను ఇక్కడనుంచి రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారు బాబు. అవసరం అనుకుంటే.. నాలుగైదు సార్లు చీరాలలో బహిరంగ సభలకు తానే వస్తానని, కచ్చితంగా ఆమంచిని మాత్రం ఓడించాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆర్డర్‌ పాస్‌ చేశారట. ఆరు నూరైనా సరే.. చీరాలలో టీడీపీ జెండా రెపరెపలాడాలన్నది బాబు కోరిక. మరి బాబు కోరిక తీరుతుందో లేదో.
Tags:    

Similar News