చంద్రబాబు చాణక్య రాజకీయానికి ఏ మాత్రం తీసిపోని నేర్పు కూర్పు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది. ఆయనకు చంద్రబాబుకు మధ్య విభేధాలు ఉన్నాయని, ఇక గంటాకు పార్టీతో గ్యాప్ ఉందని ఏవేవో మాటలు ఆ మధ్య కాలాన విరివిగా మీడియాలో వచ్చాయి. అయితే అవన్నీ పూర్వపక్షం చేయగల సత్తా గంటాకు ఉంది మూడేళ్ళ పాటు సైలెంట్ గా ఉన్నా, చంద్రబాబుకు అసెంబ్లీలో అవమానం జరిగినా నోరెత్తకపోయినా, ఏకంగా మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినా ఖండించకపోయినా కూడా గంటా అంటే గంటానే. ఆయనకు ఆయనే సాటి లేరు ఎవరూ పోటీ.
ఆయన రాజకీయ చాతుర్యం బాబుకు తెలుసు. గంటాకు కూడా ఎపుడు ఎలా గంట గణగణమని మోగించాలో బాగా తెలుసు. అందుకే మూడేళ్ళ తరువాతనే ఆయన బిగ్ సౌండ్ చేస్తున్నారు. చంద్రబాబు విశాఖ వచ్చినా కనిపించరన్న పేరున్న గంటా ఇంటికి చంద్రబాబు వెళ్ళారూ అంటే అది సంచలనమైన రాజకీయ వార్తే కదా. మరి దాన్ని సాధించిన గంటాను గ్రేట్ అనక మరేమంటారు.
విషయానికి వస్తే బుధవారం చంద్రబాబు విశాఖ వస్తున్నారు. మరో వైపు చూస్తే గంటా విశాఖలో ఉండి బాబుకు ఎయిర్ పోర్టులో స్వాగతం పలకాలి. కానీ దీనికి రివర్స్ లో బాబు గంటా ఇంటికే వెళ్లారు. హైదరాబాద్ లో గంటా నివాసంలో ఆయన మనవడి పుట్టిన రోజు వేడుకులకు జరిగాయి. దానికి చంద్రబాబుని ఆహ్వానించారు. అంతే క్షణం ఆలస్యం చేయకుండా సీనియర్ నాయకుడి ఇంటికి బాబు వెళ్లారు.
అక్కడ చాలా సేపు గడిపిన బాబు గంటా మనవడిని ఎత్తుకుని మరీ ముద్దు చేశారు. గంటా తనయుడు రవితేజా భుజం తట్టి అభినందించారు. అంతే కాదు గంటాతో చాలా సేపు మంతనాలు జరిపారు. ఇది చాలాదా గంటా టీడీపీకి దూరం ఆయనకు బాబుకు మధ్య విభేధాలు ఉన్నాయని ప్రచారం చేసేవారికి అని అంటున్నారు.
అంతే కాదు బురదపాములు అంటూ సొంత పార్టీలో కొందరు ఇండైరెక్ట్ గా కమెంట్స్ చేసినా గంటా బ్యాచ్ పట్టించుకోకపోవడానికి కూడా కారణం వారి రాజకీయం వారికి ఉంది. వారి ఎత్తుగడలు వారికి ఉన్నాయి. అంగబలం అర్ధంబలమే కాదు, అవసరం అయితే రంగంలోకి దిగి పది మందిని గెలిపించుకునే సత్తా కలిగిన నేత గంటా అని చెబుతారు.
అందుకే చంద్రబాబు ఆయనకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలు అన్ని రకాలుగా గట్టిగా జరగబోతున్నాయి. మరి దానికి తగినట్లుగా వైసీపీని ఢీ కొట్టాలీ అంటే గంటా వంటి వారు వెంట ఉండాల్సిందే. సో అందుకే బాబు గంటా ఇంటికి వెళ్లారని అంటున్నారు. గంటా సైతం తాను కోరుకున్న వారికి టికెట్లు ఇప్పించుకోవడం ద్వారా తిరిగి టీడీపీలో చక్రం తిప్పాలని చూస్తున్నారు. సో గంటా మళ్ళీ టీడీపీలో రైజింగ్ అని ఆయన అభిమానులు అంటున్నారు అంటే సొంత పార్టీలో ప్రత్యర్ధులు బయట పార్టీలోని వారు నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందే.