ఒంట‌రిగా ఏడాది బ‌త‌క‌లేక‌పోయావు బాబూ !

Update: 2018-11-02 01:30 GMT
వైఎస్ జ‌గ‌న్‌. పార్టీలో ప‌నిచేసిన అనుభ‌వం లేదు. ప్ర‌భుత్వాన్ని న‌డిపిన అనుభ‌వం లేదు. కానీ తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత కాంగ్రెస్ అండ లేకుండా... అనేక అధికారిక వేధింపుల మ‌ధ్య పార్టీ పెట్టారు. నిల‌బ‌డ్డారు. ప్ర‌తిప‌క్షంలో ఉంటూ ఎవ‌రి నుంచి మ‌ద్ద‌తు లేక‌పోయినా నిల‌బ‌డ్డారు. ఏ పార్టీతోనూ పొత్తులేదు. తాను ఒక్క‌డు. శ‌త్రువులు బోలెడు. కానీ అద‌ర‌లేదు. బెద‌ర‌లేదు. సినిమా స్టార్ల‌ను, పొలిటిక‌ల్ స్టార్ల‌ను త‌ట్టుకుని నిల‌బడ్డారు. రాజ‌కీయం వార‌స‌త్వంగా రాలేదు. కానీ ధైర్యం మాత్రం జ‌గ‌న్‌కు వార‌స‌త్వంగా వ‌చ్చింది. వైసీపీ తండ్రి పెట్టిన పార్టీ కాదు. తాను పెట్టిన మొద‌టి ఏడాదిలోనే 35 ఏళ్ల సీనియ‌ర్‌ - మాజీ సీఎంను ఢీకొని గ‌డ‌గ‌డ‌లాడించాడు. ఇపుడు కూడా ఈసారి ఓడిపోతామేమో అన్న వీసమెత్తు అనుమానం కానీ భ‌యం కానీ లేదు. మ‌ళ్లీ మేము క‌లుస్తాం అన్నా... ఏ డిమాండ్ల‌కు త‌లొగ్గ‌కుండా ఏ బెదిరింపుల‌కు లొంగ‌కుండా ముందుకు దూసుకెళ్తున్నారు జ‌గ‌న్‌.

ఇక 40 ఏళ్ల సీనియ‌ర్ చంద్ర‌బాబు ప‌రిస్థితి చూస్తే... ఎన్టీఆర్ నీడ‌లో చాలా కాలం బ‌తికారు. 1989లో ఎన్టీఆర్ ఇగోతో ముఖ్య‌మంత్రిగానే అసెంబ్లీనే అడుగుపెడ‌తాను అని శ‌ప‌థం చేస్తే... అనుకోని అదృష్టం వ‌రించి ప్ర‌తిప‌క్ష నేత అయ్యారు చంద్ర‌బాబు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నం సృష్టించి గెలిస్తే ల‌క్ష్మీపార్వ‌తి అనే సాకు చెప్పి వెన్నుపోటుతో ప్ర‌భుత్వాన్ని కూల్చి తాను ముఖ్య‌మంత్రి అయ్యారు. ఎన్టీఆర్ ఆ బాధ‌తోనే మ‌రణించారు. ఆ త‌ర్వాత బాబు ఎన్న‌డూ ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు పోలేదు. అస‌లు ఆ ఆలోచ‌న కూడా చేయ‌లేదు. 1999లో బీజేపీ - 2004లో బీజేపీ - 2009లో టీఆర్ ఎస్‌ - 2014లో బీజేపీ... ఇపుడు 2019 కాంగ్రెస్ తో పొత్తు. చివ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా 15 సీట్ల‌కు దిగ‌జారి కాంగ్రెస్‌తో పొత్తుకు వెళ్లారు. ఇది చంద్ర‌బాబు ప‌రిస్థితి. 2018 మార్చిలో బీజేపీ పొత్తు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు ఈసారి అయినా పొత్తు లేకుండా ఎన్నిక‌ల‌కు పోతాడేమో అని పాపం త‌మ్ముళ్లు ఆశ‌ప‌డ్డారు. కానీ బాబు స‌త్తా త‌మ్ముళ్ల‌కు తెలియ‌దేమో గానీ బాబుకు తెలుసు. అందుకే ఆ ధైర్యం చేయ‌లేదు. ఆరంటే ఆరు నెల‌ల్లో ఇంకో పార్టీ అండ చూసేసుకున్నారు. టీడీపీ సిద్ధాంతానికి స‌మాధి కట్టి కాంగ్రెస్ గుర్రం ఎక్కేశారు. పొత్తు లేకుండా బాబు బ‌త‌క‌లేరు. ఒంట‌రిగా నిలిచి గెల‌వ‌లేరు.
    

Tags:    

Similar News