రాజకీయంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఉతికి ఆరేసేలా మాట్లాడే తత్వ్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో కనిపిస్తుంది. అదే సమయంలో.. తాను అన్ని మాటలు అన్నప్పటికీ.. బయట అదే వ్యక్తి కనిపిస్తూ సాదాసీదాగా మాట్లాడేయటం కేసీఆర్ లక్షణం. నిజానికి ఈ తీరు కాస్త విలక్షణమైనదనే చెప్పాలి. రాజకీయ అంశాలు వచ్చేసరికి ఎంత దూకుడుగా ఉంటారో.. అవసనమైనప్పుడు ఎంతలా తిట్టి పోస్తారో.. ఎదురెదురుగా కలిసినప్పుడు మాత్రం ‘రాజకీయాల్ని’ వదిలేసి మాట్లాడటం కేసీఆర్ లో కనిపిస్తుంది.
తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ విందు ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరు చంద్రుళ్లు కలిశారు. ఇరువురు 20 నిమిషాలకు పైనే ఓపక్క నిలుచొని మాట్లాడుకున్నారు. వారి వెంట బండారు దత్తాత్రేయ.. కేంద్రమంత్రి సుజనా చౌదరి.. ఏపీ స్పీకర్ కోడెలశివప్రసాద్ లాంటి వారు కాసేపు ఉన్నారు. ఈ ఇరువురు చంద్రుళ్లు రాజకీయాల గురించి.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయితీల గురించి మాట్లాడుకునే కన్నా.. నోట్ల రద్దు అంశంపైన మాట్లాడుకోవటం కనిపించింది.
నోట్ల రద్దు అంశంపై తనతో ప్రధాని మాట్లాడిన మాటల్ని కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా.. దానికి ముందస్తు కసరత్తు కొంత చేసి ఉంటే బాగుండేదని.. కరెన్సీ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని ప్రధాని దృష్టికి తాను తీసుకెళ్లినట్లుగా కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని తనతో భావోద్వేగంగా మాట్లాడారని చెప్పారు.
తనను ఒక రాష్ట్రం ప్రజలు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని.. తనలాంటి సాధారణ వ్యక్తిని దేశ ప్రజలు ప్రధానిని చేశారని.. వారికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో.. అంతా ఆలోచించే నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారన్నారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ.. పులి మీద స్వారీ చేస్తున్నారని అన్నప్పుడు.. దేనికైనా సిద్ధమయ్యే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారని చంద్రబాబుతో కేసీఆర్ చెప్పారు.
ఈ అంశంపై ఎక్కువ కసరత్తు చేస్తే.. లీక్ అయ్యే ఉద్దేశంతో ఎవరికి సమాచారం ఇవ్వకుండా చేయాల్సి వచ్చిందని.. నోట్ల రద్దుతో ప్రజలు పడే ఇబ్బందులు తాత్కాలికమేనని.. తర్వాత ప్రజలకు.. దేశానికి మేలు జరుగుతుందన్న అభిప్రాయంతో ప్రధాని ఉన్నట్లు చెప్పారు. కేసీఆర్ చెప్పిన మాటల్ని విన్న బాబు.. చాలా విషయాలే మాట్లాడుకున్నారన్నమాట అనగా.. దానికి స్పందనగా కేసీఆర్.. ‘‘మీరు ఎక్కువసార్లు కలుస్తారు. నేను అన్నిసార్లు కలవను కదా’’ అని జవాబిచ్చారు.
నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. అందుకే డిజిటల్ కరెన్సీని ప్రజలకు ఒకసారి అలవాటు చేస్తే అల్లుకుపోతారన్న కేసీఆర్.. నగదురహిత గ్రామాలకు సంబంధించి తాము చేస్తున్న పని గురించి చెప్పి.. మీరేం చేస్తున్నారని చంద్రబాబుకు అడగటం గమనార్హం. తాము నగదు రహిత గ్రామాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. నోట్ల రద్దు కారణంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందన్న అభిప్రాయం ఇద్దరు ముఖ్యమంత్రుల్లో వ్యక్తం కాగా.. ఇరు రాష్ట్రాల మధ్యనున్న వివాదాల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలన్న అభిప్రాయాన్ని ఇద్దరూ వ్యక్తం చేశారు. ఇక.. ఏపీ సచివాలయాన్ని తెలంగాణకు అప్పగించాలన్న మాటను కేసీఆర్ అడగ్గా.. అన్ని విషయాల్ని ఒకేసారి తేల్చేద్దామంటూ చంద్రబాబు బదులిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన విషయాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇద్దరు చంద్రుళ్లు.. కేంద్రమంత్రి సుజనా చౌదరితో చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/