తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొత్త ‘మంత్రం’

Update: 2016-10-26 10:21 GMT
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పదును పెడుతున్నారు.  వచ్చే ఎన్నికలు కీలకం కావడంతో అన్ని వర్గాలనూ ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో వెళ్తున్నారు. అందుకే సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా ప్రభావవంతంగా ఉండే బ్రాహ్మణ సమాజాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ -  చంద్రబాబులిద్దరూ  బ్రాహ్మణవర్గాన్ని సంతృప్తిపరిచేందుకు పోటీ పడుతున్నారు.  పోటాపోటీగా హామీలు గుప్పిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌ లో బ్రాహ్మణ సంఘం నేతలతో సమావేశమైన తెలంగాణ సీఎం కేసీఆర్ - వారికోసం బ్రాహ్మణ సదన్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. తాజాగాఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ రిటైల్‌ ఆపరేషన్స్‌ ప్రారంభోత్సవానికి మంగళవారం రాత్రి వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ వారిని ఆకాశానికెత్తేశారు. బ్రాహ్మణులు మేధావులని.. వారిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పొగిడేశారు. బ్రాహ్మణ సొసైటీకి ఆర్థికపరమైన తోడ్పాటు ఇస్తామని హామీ కూడా ఇచ్చేశారు.

మూడేళ్ల కిందట ‘వస్తున్నా మీకోసం పాదయాత్ర’కు శ్రీకారం చుట్టిన చంద్రబాబు, టీడీపీ రూలింగ్‌ లోకి వస్తే కార్పస్ ఫండ్ బ్రాహ్మణ కమ్యూనిటీకి 500 కోట్ల కేటాయిస్తామని వాగ్దానం ఇచ్చారు.. బడ్జెట్‌ లో వారికి ఎంత కేటాయించారన్నది పక్కనపెడితే తనకు నమ్మకస్థుడైనా మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్ణారావుని మాత్రం బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా నియమించారు. మొత్తానికి బ్రాహ్మణ ఓటు బ్యాంకు కోసం ఇద్దరు చంద్రులూ గట్టిగానే కృషిచేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News