నిన్న బాబు - నేడు కేసీఆర్..అదే ఆరాటం..

Update: 2018-10-24 05:00 GMT
కాంట్రీ బ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్).. కొన్నేళ్ల క్రితం వరకూ ప్రభుత్వ ఉపాధ్యాయులు రిటైర్ మెంట్ అయ్యాక వారి బేసిక్ ను బట్టి వారికి నెలవారీగా పింఛన్ అందేది. దాంతో చనిపోయేదాక ప్రభుత్వ పింఛన్ తో హాయిగా గడిపేవారు. కానీ ఇది వారికి స్వాంతన ఇచ్చినా ప్రభుత్వాలకు మాత్రం గుదిబండగా మారేది. బడ్జెట్ లో కోట్లు ఖతమయ్యేది.

అందుకే గడిచిన ప్రభుత్వాలు ఈ పింఛన్ వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగి పనిచేసినప్పుడు జీతాల్లోంచి కట్ చేసి రిటైర్ మెంట్ రోజు కొన్ని లక్షలు చేతిలో పెట్టి దులుపుకునేలా సీపీఎస్ వ్యవస్థను తెచ్చారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులందరూ ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా నిన్న మంగళవారం గుంటూరులో ఏపీ ఉద్యోగులంతా నిరసన సభకు పూనుకున్నారు. ర్యాలీలు - సభలతో హోరెత్తించారు.. నవంబర్ 15న ఉద్యోగుల సమ్మెకు పిలుపునిచ్చారు.

చంద్రబాబు ప్రోత్సాహంతో ఏపీ ఉద్యోగులు కేంద్రంపై పోరుబాటుకు సిద్ధమయ్యారు. ఇది తెలంగాణ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైంది. అందుకే వారి అసంతృప్తిని తగ్గించడానికి తాజాగా కేసీఆర్ రంగంలోకి దిగారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో మోడీని ఢీకొనే బదులు సుప్రీం కోర్టుకెక్కి తేల్చుకోవాలని నిర్ణయించింది.

ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసును కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. ఏకీకృతం చేసే అధికారం రాష్ట్రపతికి లేదని.. హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని.. తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ తరఫున స్పెషల్ లీవ్ పిటీషన్ ను సుప్రీం కోర్టులో దాఖలు చేయించారు. అందరూ ఉపాధ్యాయులను ఒకగాటిన కట్టి వారికి జీతాలు - ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ముందస్తు ఎన్నికల వేళ .. కేసీఆర్ వేసిన ఈ స్కెచ్ ఉపాధ్యాయ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామం కేసీఆర్ కు ఎంతో మేలు చేకూరుస్తోంది. బాబు సీపీఎస్ బాట పడితే.. కేసీఆర్ ఏకీకృతంపై పోరు సలుపుతూ ఉద్యోగుల మనసు దోచే పనిలో పడ్డారు. మరి ఇవి ఓట్లు కురిపిస్తాయా లేదా అన్నది వేచిచూడాల్సిందే..
   

Tags:    

Similar News