రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ సంక్రాంతి పండగను ఎలా జరుపుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడు ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో కుటుంబ సభ్యుల మధ్యన పండగను జరుపుకున్నారు. పండగ పేరుతో తన దగ్గరకు వచ్చే నేతల్ని ఎవరిని రావొద్దని విస్పష్టంగా చెప్పటంతో ఫాంహౌస్ దగ్గర ఎలాంటి సందడి లేకుండా పోయింది. తన కుటుంబ సభ్యుల మధ్య పండగను పూర్తి చేసుకున్న కేసీఆర్.. శనివారం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఇక.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త భిన్నంగా సంక్రాంతిని జరుపుకున్నారు. ఆయన తన స్వగ్రామమైన నారావారి పల్లెకు వెళ్లారు. చంద్రబాబు ఫ్యామిలీతో పాటు.. ఆయన వియ్యంకుడు బాలయ్య ఫ్యామిలీ కూడా నారావారి పల్లెలో సంక్రాంతి పండగను చేసుకోవటంతో ఊరంతా సందడిగా మారింది.
ఇద్దరు చంద్రుళ్లు జరుపుకున్న సంక్రాంతిని చూస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ సభ్యుల మధ్య జరుపుకున్నారు. పండగను ఇంటి వరకే పరిమితం చేసుకున్నట్లు కనిపించింది. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సందడి సందడిగా సంక్రాంతిని జరుపుకున్నారు. తన స్వగ్రామానికి వెళ్లటంతో ఊరు మొత్తం పండగ వాతావరణం కనిపించింది. ఇక.. బంధుమిత్రులను కలుసుకునేందుకు.. వారితో ఉల్లాసంగా గడిపేందుకు బాబు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించింది.