వారి ర‌క్ష‌ణ మాదే అంటున్న బాబు, లోకేష్‌

Update: 2015-08-29 08:41 GMT
ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ర‌క్షాబంధ‌న్ కార్యక్ర‌మంలో పాల్గొన్న చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కు త‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ క్యాంప్ కార్యాల‌యంలో చంద్ర‌బాబుకు మంత్రులు ప‌రిటాల సునీత‌, కిమిడి మృణాళిని, పీత‌ల సుజాత‌తో పాటు కృష్ణా జిల్లా జ‌డ్పీ చైర్‌ ప‌ర్స‌న్ గ‌ద్దే అనూరాధ రాఖీ క‌ట్టారు. అలాగే బ్ర‌హ్మ‌కుమారీలు కూడా బాబుకు రాఖీలు క‌ట్టి త‌మ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ర్టాల్లో మ‌హిళ‌లకు తాను ర‌క్ష‌ణ‌క‌వ‌చంలా ఉంటాన‌న్నారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు టీడీపీ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు. ఇక లోకేష్ కూడా మ‌హిళ‌ల‌కు ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లంటూ ట్వీట్ చేశారు. మ‌హిళ‌ల‌కు త‌మ ప్ర‌భుత్వం ర‌క్ష‌ణగా ఉంటుందని...వారి ర‌క్ష‌ణ బాధ్య‌త త‌మ‌దేన‌ని లోకేష్ చెప్పారు. అలాగే ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఉనికి కోసం నానా పాట్లు ప‌డుతున్నారంటూ లోకేష్ ట్వీట్ట‌ర్‌ లో ఎద్దేవా చేశారు. ప్ర‌శాంతంగా ఉన్న ఏపీలో గొడ‌వ‌లు సృష్టించ‌డ‌మే జ‌గ‌న్ ధ్యేయంగా క‌నిపిస్తోంద‌న్నారు.
Tags:    

Similar News