ముందస్తుకు సర్వం సిద్దమైపోయింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ఒకే కూటమిగా ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్దుల ప్రకటనకు రంగం సిద్దం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష‌్ట్ర సమితిని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న పార్టీలు ఇందుకోసం ఎలాంటి త్యాగానికైన సిద్ద పడాలని నిర్ణయించారు. పొత్తులలో భాగంగా సీట్లు కోల్పోయిన వారికి అధికారంలోకి వచ్చాక పదవులు కట్టబెడతామంటూ బుజ్జగించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. పార్టీలో అసమ్మతి రాగం వినిపించరాదని అటు కాంగ్రెస్ - ఇటు తెలుగుదేశం పట్టుదలగా ఉన్నాయి. తమవైపు నుంచి పోటి అభ్యర్దులను నిలబడకూడదని ఇందుకు ఏలాంటి చర్యలైన తీసుకోవాలని అగ్రనాయకత్వం నిర్ణయించింది.
ఇదే విషాయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ నాయకులకు - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు - తెలంగాణ తమ్ముళ్లకు స్పష‌్టం చేసారు.ప్రతిపక్షాల మహాకూటమితో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దులలో కలకలం మొదలైందని ఆ పార్టీవారే చెబుతున్నారు. అభ్యర్దులను కాకుండా తనను చూసి ఓటు వేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎన్నికలకు వేడుతున్నారు. అయితే ఈ నినాదం బూమ్రాన్ అవుతుందేమోనని నియోజక వర్గాలలో తమ పట్ల వ్యతిరేకత వస్తుందని తెరాస అభ్యర్దులు కలవరపడుతున్నట్లు సమాచారం. నాలుగేళ్లగా నియోజకవర్గంలోని ప్రజలకు తాము అందుబాట్లో ఉన్నామని, కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను అందరికీ ఆపాదించడం భావ్యం కాదని అభ్యర్దులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేది శాసనసభ్యులే తప్పా ముఖ్యమంత్రి కాదని - అలాంటప్పుడు తనను చూసి ఓటు వేయమని కేసీఆర్ ఎలా అడుగుతారని అభ్యర్దులు ప్రశ్నిస్తున్నారు. మహాకూటమితో దూసుకువస్తున్న ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి ఒక్కరే అడ్డుకోవాలనుకోవడం సరైనది కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితులని అంచనా వేస్తున్న అభ్యర్దులలో గెలుపుపై అనుమానాలు వ్యక్తంమవుతున్నాయని పరిశీలకుల అంచన. పొత్తులో భాగంగా మహాకూటమిలో ఏమైన విబేధాలు వస్తే వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహం. ఈ వ్యూహాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కగా అమలు చేయాలనుకుంటున్నారు. ఆయన గురించి, ఆయన రాజకీయాల గురించి, వ్యూహ ప్రతివ్యూహాల గురించి పూర్తిగా తెలిసిన చంద్రబాబు నాయుడు వాటిని ధీటుగా ఎదుర్కునేందుకు సన్నద్దం అవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం పార్టీ నాయకులతో వ్యక్తిగత సమావేశాలతో పాటు, ఫోను ద్వారా కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ నాయకులతో కూడా చంద్రబాబు నాయుడు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.